వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట
ABN , Publish Date - Oct 06 , 2024 | 12:35 AM
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు
ఆత్రేయపురం, అక్టోబరు 5: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామి వారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధులలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు తులాభారాలు, కానుకులు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.32.57 లక్షలు లభించినట్టు ఉపకమిషనర్, ఈవో భూపతిరాజు నల్లం చక్రధరరావు తెలిపారు.