Share News

బకాయి వేతనాలు విడుదల చేయాలని కలెక్టరేట్‌ ఎదుట వీవోఏల ధర్నా

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:49 AM

: వీవోఏ(యానిమేటర్ల)లకు రావాల్సిన ఎనిమిది నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు

బకాయి వేతనాలు విడుదల చేయాలని కలెక్టరేట్‌ ఎదుట వీవోఏల ధర్నా

అమలాపురంటౌన్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వీవోఏ(యానిమేటర్ల)లకు రావాల్సిన ఎనిమిది నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాము వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుదే దుర్గాప్రసాద్‌, నూకల బలరామ్‌ మాట్లాడుతూ వీవోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అక్రమంగా తొలగించిన వీఓఏలను విధుల్లోకి తీసుకోవాలని, యాప్‌ల భారం తగ్గించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జిల్లా నలుమూలలనుంచి యానిమేటర్లు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 21 , 2024 | 12:49 AM