Share News

వరప్రసాద్‌మే

ABN , Publish Date - Oct 11 , 2024 | 01:27 AM

అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. వేలాది మంది భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్న ఆలయానికి భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధమవుతోంది. గత వైసీపీ సర్కారు నిర్వాకంతో మూడేళ్లుగా అసలే మాత్రం పట్టాలెక్కని ప్రసాద్‌స్కీం పనులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం రాకతో కదలిక వచ్చింది.

వరప్రసాద్‌మే

కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీం కింద ఇన్నాళ్లకు పనుల్లో కదలిక

ఎకరంన్నర స్థలంలో రూ.10.34 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మాణం

ఒకేసారి మూడు వేల మంది భక్తులు స్వీకరించేలా భారీ భవనాలు

ప్రస్తుతం 400 మందికే పట్టేలా పాత అన్నప్రసాద భవనాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. వేలాది మంది భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్న ఆలయానికి భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధమవుతోంది. గత వైసీపీ సర్కారు నిర్వాకంతో మూడేళ్లుగా అసలే మాత్రం పట్టాలెక్కని ప్రసాద్‌స్కీం పనులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం రాకతో కదలిక వచ్చింది. భక్తులకు అన్నప్రసాద సదుపాయం నుంచి క్యూలెన్లు, విద్యుత్‌ బస్సులు, దుస్తులు మార్చుకునే గదుల వరకు భారీ స్థాయిలో వసతులు కల్పించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొత్తం 21.80 కోట్లతో చేపట్టే పనులకు రాష్ట్ర పర్యాటకశాఖ టెండర్లు పిలిచింది. అన్నవరం సత్యదేవుడి దర్శనానికి ఏటా తెలుగు రాష్ట్రా లతోపాటు ఒడిషా, పశ్చిమబెంగాల్‌ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఒకరకంగా ఏడాదికి ఇక్కడకు వచ్చే భక్తులు కోటి మందిపైనే ఉంటారు. తీరా భక్తుల రద్దీకి తగ్గట్టుగా కొండపై పెద్దగా సదుపాయాలు లేవు. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అన్న ప్రసాదానికి తాకిడి అధికంగా ఉంటోంది. కానీ ఇక్కడ అన్నప్రసాద భవనాలు కేవలం ఒకేసారి 400 మంది మా త్రమే తినడానికి సరిపోతున్నాయి. దీంతో నిరీక్షణ చాలా ఎక్కువగా ఉంటోంది. అదే రద్దీ సమయాల్లో అయితే గంటల తరబడి వేచి ఉండలేక కొందరు కొండ కిందకు వెళ్లిపోతుంటే మరికొందరు ధరాభారమైనా రత్నరిగిపై బయట హోటళ్లలో తింటున్నారు. ఈ నేపథ్యంలో అన్నప్ర సాదం భవనాల సామర్థ్యాన్ని భారీస్థాయిలో పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం రూ.10.34 కోట్లతో ఒకేసారి మూడు వేల మంది కూర్చుని తినగలిగేలా భవ నాలు నిర్మిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ ఇటీ వల టెండర్లు కూడా పిలిచింది. సత్రం గదులకు సమీంలో ప్రస్తుత అన్నప్రసాద భవనానికి అతి సమీపంలో ఈ కొత్త భవనాల సముదాయాన్ని ఎకరంన్నర స్థలంలో నిర్మించ నున్నారు. ఏడాదిన్నరలోగా వీటిని అందుబాటులోకి తేవా లని అధికారులు భావిస్తున్నారు. అలాగే అన్నప్రసాద భవ నాలను ఆనుకుని క్యూకాంప్లెక్స్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణా నికి రూ.9.91 కోట్లు వెచ్చిస్తున్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా క్యూ పద్ధతిలో తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రోజుకు కొండ పై ఐదువేల మంది భక్తులకు భోజనం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రద్దీ మించినా అందరికీ అన్నప్రసాదం వడ్డించాలని అనుకుంటోంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండపై కొందరికే అన్న ప్రసాదం అందేది. రద్దీ సమయంలో రోజుకు 2,500 మం దికి కూడా భోజనం అందివ్వలేదు. కానీ కూటమి ప్రభు త్వం మాత్రం లోటులేకుండా అందరికీ అన్నప్రసాదం ఇవ్వాలని కంకణం కట్టుకుంది. వాస్తవానికి అన్నవరం దేవ స్థానం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ (పిలిగ్రిమేజ్‌ రెజు వెనేషన్‌ అండ్‌ స్పిరిట్యుయల్‌ అగుమెంటేషన్‌ డ్రైవ్‌) స్కీం కింద ఎంపికైంది. దీంతో కొండపై మౌలిక సదుపాయాల కల్పన భారీగా ఉండబోతోందని గత వైసీపీ సర్కారు ఊదరగొ ట్టింది. స్కీం కింద ఆలయానికి రూ.48 కోట్లు వస్తాయని 2021లో అప్పటి పర్యాటకమంత్రి ముత్తంశెట్టి ప్రకటించా రు. ఇది గడిచి మూడేళ్లుపైనే అయింది. కానీ పనుల్లో మాత్రం పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం రావడంతో పనులు చకచకా కదులుతున్నాయి. కేంద్రంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉండడంతో నిధుల విడుదలలో ఇటీవల వేగం పుంజుకుంది. దీంతో రాష్ట్ర పర్యాటకశాఖ మొత్తం రూ.21.80కోట్లతో వివిధ పనులకు ఇటీవల టెండ ర్లు పిలిచింది. ఆ తర్వాత మళ్లీ రెండో విడత కింద రూ.20 కోట్లకుపైగా నిధులు దేవస్థానానికి విడుదల కానున్నాయి.

మొబైల్‌ టాయిలెట్లు.. ఎలక్ట్రికల్‌ బస్సులు..

కొండపైకి వచ్చే వేలాది భక్తులకు ఇప్పటికీ మౌలిక సదుపాయాల సమస్య ఇబ్బందిపెడుతోంది. ఈనేపథ్యంలో తాగునీటి వసతి, టాయిలెట్‌ బ్లాకులు కూడా నిర్మిస్తున్నా రు. అందులో భాగంగా రూ.61.78 లక్షలతో వీటికి టెండర్లు పిలిచారు. ఎక్కడికక్కడ వీటిని నిర్మించడంతోపాటు మొబై ల్‌ టాయిలెట్లను కూడా తీసుకువచ్చి కొండపై మరింత స్వచ్ఛ వాతావరణాన్ని పెంపొందించాలని భావిస్తున్నారు. అలాగే కొండపైన భక్తులకు అందుబాటులోకి రూ.97.98 లక్షలతో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులు కూడా ఏర్పాటుచేయ నున్నారు. వీటి కోసం ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా నిర్మించను న్నారు. అలాగే రూ.1.08 కోట్లతో కొండపై మురుగునీటి శుద్ధి నిర్వహణ చేపట్టనున్నారు. తద్వారా నీటివృథా నియంత్రణతోపాటు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 01:28 AM