Share News

విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశం వాయిదా

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:36 AM

కలెక్టర్‌ కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పి.జ్యోతిలక్ష్మీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశం వాయిదా

అమలాపురం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పి.జ్యోతిలక్ష్మీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రగతికి మూలమైన స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నందున మోనటరింగ్‌ కమిటీ సమావేశం వాయిదా వేసినట్లు చెప్పారు. కమిటీ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియచేస్తామన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 12:36 AM