కూటమికే ఓటేశారు!
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:23 AM
కూటమి ఓటేశారు..అందరినీ ఒక్క తాటిపై గెలిపించారు.. తూర్పుగోదావరి జిల్లాలో నీటి సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
ప్రశాంతంగా ముగిసిన ఎన్నిక
కూటమిలో పదవులు పంపకం
టీడీపీకే అధిక శాతం
తరువాత జనసేన-బీజేపీ
ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్
గ్రామాల్లో సందడే..సందడి
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
కూటమి ఓటేశారు..అందరినీ ఒక్క తాటిపై గెలిపించారు.. తూర్పుగోదావరి జిల్లాలో నీటి సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అన్ని సంఘాలు కూటమికే దక్కడం గమనా ర్హం. వైసీపీ ఊసెక్కడా వినిపించలేదు. జిల్లాలో 809 ప్రాదేశిక సభ్యులు (టీసీ)లు మొదట ఎన్నికలు జరిగాయి. వారి నుంచి 113 నీటి సంఘాలను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.ఒక్కో నీటి సంఘంలోనూ 12 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒకరిని ప్రెసి డెంట్‌గా, మరొకరిని వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.మిగతావారు డైరెక్టర్లుగా ఉన్నా రు. ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకూ ప్రాదేశిక సభ్యుల ఎన్నిక జరిగింది. సాయంత్రం 3 గంటల నుంచి నీటి సంఘాల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ల ఎన్నిక జరిగింది. ఎక్కడా ఎటువంటి అలజడి లేకుండా ఎన్ని కలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలే చక్రం తిప్పారు. నిడదవోలులో జనసేన ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఉండడం వల్ల నిడ దవోలు మండలంలో కూటమి ఉమ్మడిగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుంది. కొన్ని టీడీపీకి, కొన్ని జనసేనకు వచ్చాయి. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో అన్నీ టీడీపీకే దక్కాయి. డైరెక్టర్ల పదవులు ఇరు పార్టీలు పంచుకోవడం గమనార్హం. ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరు గుపల్లి శేషారావు అవగాహనకు వచ్చినట్టు సమాచారం.గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ,జనసేన పంచుకున్నాయి.ఇక్కడ ఎమ్మె ల్యే మద్దిపాటి వెంకట్రాజు చక్రం తిప్పారు. రాజమహేంద్రవరం రూరల్‌లో ఎక్కువ సం ఘాలు టీడీపీకి దక్కాయి. రాజానగరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చక్రం తిప్పారు.టీడీపీ ఇన్‌చార్జి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎమ్మెల్యే మధ్య ఒక అవగాహనకు రావడంతో రెండు పార్టీలకు ఇక్కడ నీటి సంఘాలు దక్కాయి. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి చక్రం తి ప్పారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే అయినప్ప టికీ,ఆయన కుమారుడు టీడీపీ ఇన్‌చార్జి కావడంతో నీటి సంఘాల ప్రెసిడెంట్ పద వులు ఎక్కువగా టీడీపీకి, డైరెక్టర్ల పదవులు బీజేపీకి రావడం గమనార్హం. జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశా యని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) టి. సీతారామమూర్తి తెలిపారు.ఈ నీటి సంఘాల ప్రెసిడెంట్లు 17వ తేదీన డిస్ర్టిబ్యూటరీ కమి టీని ఎన్నుకుంటారు.తర్వాత ప్రాజెక్టు కమి టీని ఎన్నుకుంటారని చెప్పారు.నీటి సంఘాల ఎన్నికలు పూర్తవుతుండడంతో రైతులలో సం దడి నెలకొంది. ఇప్పటి వరకూ అస్తవ్యస్తంగా తయారైన నీటిపారుదల వ్యవస్థను ఒక పద్ధతిలో పెట్టడానికి ఈ సంఘాలు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.