ఏకగ్రీవాలు పోటెత్తాయి
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:28 AM
జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. దాదాపు అన్నిచోట్లా పెద్దగా పోటీలేకపోవ డంతో అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. గడచిన అయిదేళ్ల పాలనలో వైసీపీ జిల్లాలో సాగునీటి సంఘాలను నిర్వీర్యం చేసేసింది.
దాదాపు అన్నిచోట్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఏకగ్రీవం
పోటీచేసిన ప్రతిచోటా టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి విజయబావుటా
అనేకచోట్ల మూడు పార్టీలు కలిసి పదవులు పంపకంతో కలిసి నడిచిన వైనం
వైసీపీ కకావికలం కావడంతో ఈ పోటీకి సాహసించని వైనం
పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి నీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత
అభ్యర్థులిద్దరూ అస్వస్థతకు గురవడంతో మల్లవరం పీబీసీ ఎన్నిక వాయిదా
(ఆంధ్రజ్యోతి- కాకినాడ)
జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. దాదాపు అన్నిచోట్లా పెద్దగా పోటీలేకపోవ డంతో అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. గడచిన అయిదేళ్ల పాలనలో వైసీపీ జిల్లాలో సాగునీటి సంఘాలను నిర్వీర్యం చేసేసింది. ఎన్నికలు నిర్వహించకుండా వాటిని నిస్తేజం చేసేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే సాగునీటి సంఘాల ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో శనివారం 236 సాగు నీటి సంఘాలకు ఎన్నికలు జరగ్గా, దాదాపు అన్నీ ఏకగ్రీవమై కూటమి పార్టీల ఖాతాలో పడ్డాయి. ఈ మూడు పార్టీలు ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ పదవుల పంప కంలో ఐక్యంగా ముందుకు కదిలి మంచి ఫలి తాలు రాబట్టాయి. వాస్తవానికి కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడా ఏడింటికి ఒక్క సీటంటే ఒక్కటి కూడా గెలవలేదు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోను కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో శనివారం నాటి ఎన్నికల్లో గోదావరి డెల్టా, ఏలేరు, పంపా, సుబ్బారెడ్డిసాగర్, తాండవ రిజర్వాయర్ల పరి ధిలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీకి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచే పోటీకి అభ్య ర్థులు బరిలో నిలబడ్డారు. అటు ఓటమి తర్వాత వైసీపీ జిల్లాలో నామరూపాల్లేకుండా పోవడం, ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కూడా లేకపోవడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీకి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా అధ్యక్ష, ఉపా ధ్యక్ష స్థానాలకు పోటీచేసిన దాదాపు అన్ని స్థానాలు ఏకగ్రీవమైపోయాయి. ఉదయం 8 గంటలకు తొలుత ప్రాదేశిక నియోజకర్గ సభ్యుల ఎన్నిక జరిగింది. మధ్యాహ్నం నుంచి సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షల ఎన్నిక జరిగింది. ఎక్కడా అల్లర్లు, గొడవలు జరగకుండా కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం నుంచి అధికారులు ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. ప్రధానంగా ఎన్ని కల్లో టీడీపీ తరఫున సాగునీటి సంఘం అధ్యక్షుడిగా నిలబడినచోట ఉపాధ్యక్ష పదవి జనసేనకు ఇచ్చేలా కూటమి పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. జనసేన నుంచి అధ్య క్ష స్థానానికి బరిలో ఉన్నచోట టీడీపీ అభ్యర్థికి ఉపాధ్యక్ష పదవి వచ్చేలా నేతలు ఏకాభిప్రా యానికి వచ్చారు. బీజేపీ అధ్యక్ష పదవికి బరిలో ఉన్నచోట మిగిలిన పదవులను టీడీపీ, జనసేనలు పంచుకున్నాయి. ప్రధానంగా తొం డంగి మండలంలో 16 నీటి సంఘాలకు 144 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరపలో తొమ్మిది నీటి సంఘాలకు, కిర్లంపూడి, యు.కొత్తపల్లి, గండేపల్లి, కోటనం దూరు, తుని మండలాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 11 సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కాగా తుని మండలంలో ఏకగ్రీ వంగా ఎన్నికైన అధ్యక్ష,ఉపాధ్యక్షులను మాజీ మంత్రి యనమల అభినందించారు. అటు పిఠాపురంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులను మాజీ ఎమ్మె ల్యే వర్మ అభినందించారు. రైతులకు ఏకష్టం వచ్చినా అంతా అండగా నిలబడాలని పిలుపు నిచ్చారు. కాగా గొల్లప్రోలు మండలం తాటిప ర్తి కోదండరాముని చెరువు నీటి సంఘం ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎన్నికల అధి కారి ఇక్కడ ఎన్నిక వాయుదా వేశారు. గొల్లప్రోలు మండలం మల్లవరం పీబీసీ నీటి సంఘం అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. అధ్యక్ష పదవికి పోటీ పడిన అభ్యర్థులు ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురి కావడంతో అధికా రులు ఎన్నికను వాయిదా వేశారు. కాగా ఈ నెల 17న జిల్లాలో 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలు జరగనున్నాయి.
1965 ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలు ఏకగ్రీవం
కలెక్టరేట్(కాకినాడ)/జీజీహెచ్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): శనివారం కాకినాడ జిల్లాలో నిర్వహించిన నీటి వినియోగదారుల సంఘాల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ స్వల్ప సంఘటనలు మినహా సజావుగా జరి గిందని ఎన్నికల నోడల్ అధికారి, ఏలేరు డివి జన్ డీఈఈ జి.శేషగిరిరావు తెలియజేశారు. జిల్లాలోని 236 సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిలోని 1984 ప్రాదేశిక నియో జక వర్గాలకుగాను 1965 టీసీలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఒక నియో జక వర్గం, పిఠాపురం మండలం, మంగితుర్తి, వై ఆర్పీటిసి-2 మాత్రమే ఎన్నిక ద్వారా ఎంపిక జరిగిందన్నారు. మిగిలిన 18 టీసీలలో తాటి పర్తి కోదందరామ టాంక్ (పెద్దటాంక్)కు సం బంధించిన 6టీసీల ఎన్నిక వాయిదా పడగా, మరో 12 టీసీలు క్యాజువల్ వేకెన్సీలుగా మిగి లి పోయాయన్నారు. ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలు పూర్తయిన సాగునీటి వినియోగదా రుల సంఘాలకు సాధారణ సర్వసభ్య సమా వేశాలు నిర్వహించగా టీసీ సభ్యులు ఆయా సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకు న్నారు. మొత్తం 236 నీటి వినియోగదారుల సంఘాలకుగాను, 234 సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. టీసీ ఎన్ని కలు వాయిదాపడిన కారణంగా తాటిపర్తి కోదండరామా టాంక్ నీటి వినియోగదారుల సంఘం, సమావేశ కోరం లేనందున పీబీసీ-11 మల్లవరం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల అధికారి పబ్లిష్ చేసిన వెన్యూలలో జరుగగా, కలెక్టరేట్ నుంచి నోడల్ అధికారి జి.శేషగిరిరావు, ఇరిగేషన్ డీఈ రవికుమార్, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్‌రావు, సమన్వయపరిచారు. కలెక్టర్ షాన్‌మోహన్, జేసీ రాహుల్‌మీనా పర్యవేక్షించారు. ఎస్పీ శ్రీకాంత్ పాటిల్ ఆదేశాలతో ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల బందోబస్తు నిర్వహించారు.
తాటిపర్తి నీటి సంఘం ఎన్నికల్లో వివాదం
మల్లవరంలోనూ వాయిదా
గొల్లప్రోలు రూరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం తాటిపర్తి కోదండరాముని చెరువు నీటి సంఘం ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడి ఉద్రిక్తత నెలకొంది. నీటి సంఘం ఎన్నికలకు తాటిపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశా ల ఆవరణలో సమావేశం ఏర్పా టుచేశారు. నిర్ణీత సమయానికి కొంత ఆలస్యంగా ఒక వర్గానికి చెందినవారు రావడం, అదే సమయానికి గేట్లు వేసి ఉండ డంతో వారంతా గేట్లు దూకి లోపలకు వచ్చారు. దీనికి మరోవర్గం అభ్యంతరం తెలియజేసింది. దీంతో రెండువర్గాలు వాగ్వాదానికి దిగా యి. ఉద్రిక్తత నెలకొనడంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి డీకే నారాయణ ప్రకటించారు. అలాగే మల్లవరం పీబీసీ నీటి సంఘం-11 ఎన్నికల్లో 12 ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అనంతరం అధ్యక్ష పదవికి ఇరువురు అభ్యర్థులు తటవర్తి కొండయ్య, పాలపర్తి సత్యనారాయణలు నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ అనివార్యమైంది. ఈ దశలో పోటీలో ఉన్న కొండయ్య బయటకు వెళ్లి కొంత సమయం తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి, ఈవోపీఆర్డీ కుమార్ ప్రకటించారు.