డిసెంబరు 1 నుంచి రబీ నీటి విడుదల
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:38 AM
: జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలు వలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
రాజమహేంద్రవరం,నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలు వలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024- 25 రబీ సీజన్‌లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవ స రాలకు నీటిని అందిస్తామని తెలిపారు. తూర్పు డెల్టాకు 2,64,507 ఎకరాలు, పశ్చిమ డెల్టాకు 4, 60,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా(కోనసీమ)కు 1, 72,00 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గోదావరి నదిలో 91.35 టీఎంసీల నీరు ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రబీ ఆయకట్టుకు గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని కడియం, అనపర్తి, బిక్క వోలు మండలాలకు సంబంధించి 27,001 ఎక రాలకు, గోదావరి పశ్చిమ డెల్టా పరిధిలో కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు సంబంధించి 35,710 ఎకరాలు, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 1650 ఎకరాలకు, కలిపి మొత్తం 64,361 ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తామని చెప్పారు. ఎర్రకాలువ, కొవ్వాడ కాల్వల కిందట గోపాలపురం, కొవ్వూరు, తాళ్లపూడి మండలా ల్లోని ఆయకట్టు వర దలు, భారీ వర్షాల కార ణంగా ప్రతి ఏటా అనేక వేల ఎకరాల ఆయకట్టు ముంపునకు గురవుతున్నాయన్నారు. అందువల్ల కాల్వల ఆధునీకరణ పను లు చేపట్టి, గండ్లు పూడ్చి వేసి, ఏటిగట్ల పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.ఎర్రకాలువ, కొవ్వాడ, చింతలపూడి, తొర్రిగడ్డ, సీతానగరం ప్రాజెక్టుల ఈఈలు ఆయా ప్రాజెక్టుల పరిధిలో సీజన్‌వారీగా సాగు విస్తీర్ణం, ఆయకట్టు సాగు అంశాలకు సంబంధించిన వివరాలు నివేదిక రూపంలో వివరించారు. పురు షోత్తపట్నం, చింతలపూడి, పట్టిసీమ, వెంకట నగర్ ఎత్తిపోతల పథకాల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ ఆదేశించారు. సమా వేశంలో జేసీ ఎస్.చి న్నరాముడు, డీఆర్‌వో టి.సీతారామమూర్తి, జిల్లా నీటిపారుదల అధికారి జి.శ్రీనివాసరావు, ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్,రాణి సుష్మిత,జిల్లా వ్యవ సాయాధికారి ఎస్.మాధవ రావు, ఎంసీ కెనాల్ ఎస్‌ఈ ఏసుబాబు, ఏలూరు ఎస్‌ఈ దేవ ప్రకాష్,ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బి.వెంక టగిరి, వ్యవసాయ శాఖ ఏడీలు పాల్గొన్నారు.