రెండో అంతస్తు నుంచి పడి పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి
ABN , Publish Date - Jul 24 , 2024 | 12:08 AM
సర్పవరం జంక్షన్, జూలై 23: పొట్టకూటి కోసం పొట్ట చేత్తో వలస వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవన కార్మికుడు ప్రమాదవశాత్తూ అపార్టుమెంట్ రెం డో అంతస్తు నుంచి జారి పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రమణయ్యపేట ప్రెండ్స్ కాలనీలో మంగళవారం జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్ ముర్సిదాబాద్ జిల్లా రఘనాధ్‌గంజ్ మం డలం, సంతోష్‌పురం నూతనగంజ్‌కు చెందిన షేక్ అబ్ధుల్ బరీ (2
సర్పవరం జంక్షన్, జూలై 23: పొట్టకూటి కోసం పొట్ట చేత్తో వలస వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన భవన కార్మికుడు ప్రమాదవశాత్తూ అపార్టుమెంట్ రెం డో అంతస్తు నుంచి జారి పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రమణయ్యపేట ప్రెండ్స్ కాలనీలో మంగళవారం జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్ ముర్సిదాబాద్ జిల్లా రఘనాధ్‌గంజ్ మం డలం, సంతోష్‌పురం నూతనగంజ్‌కు చెందిన షేక్ అబ్ధుల్ బరీ (27) 6 నెలల కిందట తాపీ మేస్త్రీ వద్ద కార్మికుడుగా కూలి పని చేసేందుకు కాకినాడ వచ్చాడు. రమణయ్యపేట ప్రెండ్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న సంపత్ స్వరూపా హైట్స్ పేరుతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ రెండో అంతస్తులో ఇతర కూలీలతో కలసి మెటీరియల్ అందించే క్రమంలో మంగళవారం ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయాడు. అబ్ధుల్ బరీని సర్పవరంజంక్షన్‌లో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. మృతునికి బంధువు ఎస్.జకారియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు జీజీహెచ్‌కు తరలించినట్టు తెలిపారు. మృతుడికి భార్య, బాలుడు ఉన్నా డు.మా కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.