గజ.. గజ
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:53 AM
శీతాకాలం ప్రారంభమైన తొలి నెలలోనే చలి పులి పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తం గా కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడి పోయాయి. చలిగాలుల తీవ్రత అధికంగా ఉండ డంతో ప్రజలు చలికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత
వణికిస్తున్న వాతావరణం
కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
14 డిగ్రీలకు పడిపోయిన వైనం
సాయంత్రం మొదలు.. రాత్రి తీవ్రం
మంచుతో అర్ధరాత్రి ఇబ్బందులు
వ్యాధులతో జనం సతమతం
జాగ్రత్తలు పాటించాల్సిందే
14..15..16.. 19..20.. మన దగ్గరా ఈ ఉష్ణోగత్రలు.. అవును చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ ఏడాది చలి తీవ్రత అంతలా పెరిగింది మరి. చిన్న, పెద్ద తేడా లేదు అంతా చలికి గజగజ వణికిపోతున్నారు. మళ్లీ ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు.. చాలా ప్రాంతాల్లో చలిమంట వేసుకుని కాగుతున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా సూర్యోదయం ఆలస్యం కావడంతో రోజు ప్రారంభం ఆలస్యమవు తోంది. సాయం త్రం సూర్యాస్తమయం త్వరగా అయి పోతుండడంతో 5 గంటలకే చీకటి పడిపోతోంది. సాయం త్రం నుంచే చలి ఆరంభం కావడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ మంచు అలుము కుంటోంది. ఉదయం సూర్యోదయమైనా మంచు దుప్పటి కప్పేసి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత, వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో జనం ఇదేం ఛీ..జన్ అంటూ నిట్టూర్చుతున్నారు.
(పిఠాపురం - ఆంధ్రజ్యోతి)
శీతాకాలం ప్రారంభమైన తొలి నెలలోనే చలి పులి పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తం గా కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడి పోయాయి. చలిగాలుల తీవ్రత అధికంగా ఉండ డంతో ప్రజలు చలికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి 11 గంటల వరకూ రద్దీగా ఉండే రహదారులు 8 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నా యి. ఉదయం ఎండ వచ్చే వరకూ ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. చలితో పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంది. వాతావరణ మార్పులతో జ్వరాలు, దగ్గు, జలుబు తదితర రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది.
కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
శీతాకాలంలో సాధారణంగా డిసెంబరునెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అప్పుడే చలితీవ్రత గణనీయంగా పెరుగుతుంది. జనవరి నెలలోనూ అధికంగా ఉంటుంది. ఈసారి అం దుకు భిన్నంగా నవంబరు మూడో వారం నుంచి చలితీవ్రత పెరిగింది. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణో గ్రత 14-20 డిగ్రీలుగా నమోదవుతుండగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం 29-31 డిగ్రీలు దాటడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చిం తూరు, మోతుగూడెం తదితర ప్రాంతాల్లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల తదితర ప్రాంతాల్లోను 15, 16 డిగ్రీల కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. ఇవన్నీ ఏజెన్సీలో అటవీ ప్రాంతంలో ఉండ డంతో సహజంగానే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 16 డిగ్రీలు, దివాన్‌చెరువులో 18 డిగ్రీలు, గోపాలపురంలో 17 డిగ్రీలు నమోదవు తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. కొవ్వూ రులో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుం డడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాకినాడ జిల్లా తుని, అన్నవరంలలో 18 డిగ్రీలు, కోనసీమ జిల్లా రావులపాలెం, యానాంలో 19 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం నగరాల్లోను ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. ఉదయం 10 గంటల వరకూ చలి తీవ్రత కొనసాగుతుండగా సాయంత్రం 4 గంటలకు చలిగాలులు వీయడం ఆరంభమవుతోంది. దీంతో రోజువారీ ఉదయమే విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. చలి తీవ్రతతోపాటు పొగమంచు ప్రభావం గణనీయంగా పెరిగింది. రాత్రి 7 గం టల నుంచి ఉదయం 8 గంటల వరకూ పొగ మంచు తగ్గడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. మంచు కారణంగా అర్ధరాత్రి హైవే మూసుకుపోతోంది.
ఉన్ని దుస్తులకు డిమాండ్
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి జిల్లాలో స్వెట్టర్లు, మంకీ క్యాప్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,పం జాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారులు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర నగరాల్లో రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. చిన్నపిల్లలకు స్వెటర్లు రూ.200 నుంచి రూ.300 మధ్య, పెద్దవారికి రూ.300 నుంచి రూ.400 లభ్యమవుతున్నా యి.రగ్గుల ధరలు రూ.350 నుంచి రూ.600 వరకు ఉన్నాయి. మంకీ క్యాప్‌లు రూ.50 నుంచి రూ.100 మధ్య దొరుకుతున్నాయి.
పెరుగుతున్న జ్వరాలు
చలితీవ్రత, వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరాలతోపాటు దగ్గు, రొంప, గొంతునొప్పి, వంటి నొప్పులు వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలిలో తిరిగేవారు కళ్లమంటల తో ఒంటిపై దురద, ఎలర్జీ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ముఖానికి రక్షణ లేకుండా బయట తిరిగే వారిలో ఇది అధికంగా కనిపి స్తోంది. కొందరికి కళ్ల వెంబడి నీరు కారుతుండడం, కళ్లు దురద తీవ్రంగా ఉండడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్నారుల్లో జ్వరం, రొంప, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు చిన్నారులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పెరిగిపోయిన ఏక్యూఐ
తీవ్రమైన చలి, మంచు కారణంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నగరాలైన కాకినాడ, రాజవ ుహేంద్రవరంల్లో ఎయిర్ క్వాలిటీ ఇం డెక్స్ పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అంటే గాలిలో ఉండే నాణ్యత.. దీని రీడింగ్‌ను కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తీస్తుంటారు. ఇది 1-50 మధ్య ఉంటే గాలి నాణ్యత సురక్షితంగా ఉన్నట్టు లెక్క. ఇది 50-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా మాత్రమే ఉన్నట్టు. కానీ 100-200 మధ్యలో ఉంటే మోడరేట్ (ఆందో ళనకరస్థాయి)లో ఉన్నట్టు పరిగణిస్తారు.కాకి నాడలోని సాలి పేటలో ఏక్యూఐ స్థాయి అత్యధికంగా 108 వరకు ఉంది. రాజమ హేంద్ర వరం లోని పేపరుమిల్లు వద్ద 115 వరకు ఉంది. ఈ గణాంకాలు ఆయా నగరాల్లో ఆందోళనకరంగా ఉన్నాయి. నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండడమే వీటి పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
ప్రమాదకరం.. డాక్టర్ సూర్యకుమారి, పల్మనాలజీ, జీజీహెచ్ కాకినాడ
చలికాలం ప్రమాదకారి.. అనారోగ్య రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. ఆస్తమా రోగులు.. శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి న్యూమోనియా ఎక్కువగా వస్తుంది. చలికాలంలో పొగమంచుతో సమస్య ఉంటుంది. ముందుగా జలుబు, దగ్గు, తర్వాత జ్వరం వంటి లక్షణాలుంటాయి. వాయు, జల కాలుష్యం ఉంటే సులువుగా ఈ వ్యాధులు సోకుతాయి. అప్రమత్తతోనే చలికాలంలో పలు రకాల అనారోగ్య రుగ్మతల నుంచి ఆరోగ్యం కాపాడుకోవచ్చు.