Share News

రెడీమేడ్‌ గృహోపకరణ వస్తువులపై ఆంక్షలు విధించాలి

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:01 AM

వేప కర్రలతో కిటికీలు, గుమ్మాలు తయారుచేసి టింబరు డిపోల్లో విక్రయించడం వల్ల చేతివృత్తినే నమ్ముకున్న కార్పెంటర్లు ఉపాధిని కోల్పోతున్నారని, దీనిపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతూ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఈదరపల్లిలోని అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

రెడీమేడ్‌ గృహోపకరణ వస్తువులపై ఆంక్షలు విధించాలి

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 25: వేప కర్రలతో కిటికీలు, గుమ్మాలు తయారుచేసి టింబరు డిపోల్లో విక్రయించడం వల్ల చేతివృత్తినే నమ్ముకున్న కార్పెంటర్లు ఉపాధిని కోల్పోతున్నారని, దీనిపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతూ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఈదరపల్లిలోని అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భవన నిర్మాణ గృహోపకరణ వస్తువులపై ఆంక్షలు విధించాలని కోరారు. భవన నిర్మాణ కార్పెంటర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో అభ్యర్థించారు. కార్యక్రమంలో గున్నేపల్లి భీమశంకరం, కొనుకు వెంకటేశ్వరరావు, కేతా సోమేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాసరావు, యర్రలగడ్డ హనుమకుమార్‌, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, జల్లి సత్యనారాయణ, పొలమూరి రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 01:01 AM