వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్‌కు ఎంపికైన వ్యాయామ ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:59 AM
ఎటపాక, పిబ్రవరి12: అల్లూరి జిల్లా ఎటపాక మండలం నల్లకుంట గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సొడి నాగిరెడ్డి వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపియ్యారు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలోని హైదారాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 5వ నేషనల్ మాస్ట
ఎటపాక, పిబ్రవరి12: అల్లూరి జిల్లా ఎటపాక మండలం నల్లకుంట గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సొడి నాగిరెడ్డి వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపియ్యారు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలోని హైదారాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 5వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో నాగిరెడ్డి షాట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్, జావలిన్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్స్‌ను సాధించారు. దాంతో నాగిరెడ్డి వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో ఇతర దేశంలో జరగనున్న పోటీల్లో నాగిరెడ్డి పాల్గొననున్నారు. దీంతో నాగిరెడ్డిని విలీన మండలాల్లోని అనేక మంది ఉపాధ్యాయులు అభినందించారు.