Share News

ఆ యానిమేటర్‌ మాకొద్దు

ABN , Publish Date - Aug 06 , 2024 | 12:21 AM

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం కె.పెదపూడి గ్రామపరిధిలో 30డ్వాక్రా సంఘాలకు ఏర్పాటుచేసిన యానిమేటర్‌(వీఓఏ) మాకొద్దంటూఆయా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు.

ఆ యానిమేటర్‌ మాకొద్దు

అంబాజీపేట, ఆగస్టు 5: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం కె.పెదపూడి గ్రామపరిధిలో 30డ్వాక్రా సంఘాలకు ఏర్పాటుచేసిన యానిమేటర్‌(వీఓఏ) మాకొద్దంటూఆయా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. కె.పెదపూడిలో 90డ్వాక్రా సంఘాలుగా ఉండగా గతంతో ముగ్గురు యానిమేటర్లు విధులు నిర్వహించేవారు. వైసీపీ ప్రభుత్వంలో యానిమేటర్‌ చింతపల్లి మంగాదేవిని విధుల్లోకి తీసుకున్నారు. ఆమెను గ్రామంలో 30సంఘాలకు నియమించారు. యానిమేటర్‌ మంగాదేవి మాకోద్దంటూ నిరసన తెలిపారు. గ్రామసంఘాలకు తెలియకుండా యానిమేటర్‌ను నియమించారని ఐకేపీ ఏపీఎం గంగాధరరావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో స్ర్తీనిధి సొమ్ములు తీసుకోని గ్రూపు సభ్యులపై కేసులు పెడాతామని ఐకేపీ అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యానిమేటర్‌ను మా సంఘాల నుంచి తొలగించాలని లేకుంటే కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.

Updated Date - Aug 06 , 2024 | 12:21 AM