యాంత్రీకరణతో తగ్గుతున్న పెట్టుబడి
ABN , Publish Date - May 23 , 2024 | 12:34 AM
వ్యవసాయ సాగులో యాంత్రీకరణ పరికరాల వినియోగంతో రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చునని రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సాయిగంగాధరరావు అన్నారు.
వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి గంగాధరరావు
కొవ్వూరు, మే 22: వ్యవసాయ సాగులో యాంత్రీకరణ పరికరాల వినియోగంతో రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చునని రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సాయిగంగాధరరావు అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో అచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.కె.వి.రమణమూర్తి ఆధ్వ ర్యంలో బుధవారం జాతీయ సేవాపథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ సాగులో యాంత్రీకరణ ప్రాముఖ్యం, ఎలుకల నివారణకై తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సా యి గంగాధరరావు మాట్లాడుతూ యాంత్రీకరణ వలన సాగులో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. మూడు లేక నాలుగు సంవత్సరాల కొకసారి సబ్ సాయిలర్‌తో నేలను దున్నడం వలన నేలలో ఉన్న పోషకాలు ఉపరితలంలోకి చేరి మొక్కకు అందుతాయన్నారు. మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. యాంత్రీకరణ పరికరాల ప్రదర్శన ఏర్పాటుచేసి వాటి పనితీరును వివరించారు. డాక్టర్ డి.అనూష ఎలుకల నివారణకై విషపు ఎర తయారుచేసే విధానాన్ని రైతులకు వివరించారు. విషపు ఎర తయారుచేసి చూపించారు. ఎలుకలు సమగ్ర నివారణకై రైతులు సామూహిక విధానాలను అవలంభించాలన్నారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ అధికారులు డాక్టర్ కె.దక్షిణామూర్తి, డాక్టర్ సి.హెచ్. సునీత, డాక్టర్ కె.రవికుమార్, గ్రామస్తులు, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేయాలి
దేవరపల్లి, మే 22: లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా ఐదు పొగాకు వేలం కేంద్రాల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం రాజమహేంద్రవరం పొగాకుబోర్డు రీజనల్ మేనేజర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకుబోర్డు రైతు సంఘం నాయకులు కరుటూరి శ్రీనివాస్, పరిమి రాంబా బు, విల్లూరి రాంబాబు, గద్దే శేషగిరిరావులు మాట్లాడుతూ పొగాకు వేలం ప్రక్రియలో మొదటి ఏ గ్రేడ్ సెకండ్ గ్రేడ్‌లు కొనుగోలు చేస్తున్నారని లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు గ్రేడ్ కిలో రూ.340 పలుకుతుండగా లోగ్రేడ్ పొగాకు రూ.235 కొనుగోలు చేశారని ఇప్పుడు లోగ్రేడ్ పొగాకును కొనడానికి పొగాకు కంపెనీ ప్రతినిధులు ముందుకు రావడంలేదని పస్టు, సెకండ్ గ్రేడ్‌లు ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నారో లోగ్రేడ్ పొగాకును కూడా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేయాలని ఆర్‌ఎం ఆదిశేషయ్యకు రైతులు తెలిపారు. ఈ విషయంపై వచ్చే మంగళవారం కొయ్యలగూడెం వేలం కేంద్రంలో ఐదు పొగాకు వేలం కేంద్రాల రైతు సంఘం నాయకులతో సమావేశం నిర్వహిస్తామనిఆ తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయ కులు సత్రం వెంకటేశ్వరరావు, కాకర్ల నంది, తదితరులు పాల్గొన్నారు.