Share News

వైసీపీ నేతలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:08 AM

ప్రజా సమస్యలు పట్టని వైసీపీ నేతలకు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంటమణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన శుక్రవారం కొవ్వూరులోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైసీపీ నేతలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు

  • కూటమి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి

కొవ్వూరు, ఏప్రిల్‌ 26: ప్రజా సమస్యలు పట్టని వైసీపీ నేతలకు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంటమణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన శుక్రవారం కొవ్వూరులోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పిడి మాట్లాడుతూ కొవ్వూరులో మురుగునీటి డ్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలకు నిలయంగా మారాయని, తాగునీరు, పారిశుధ్య సమస్య అధికంగా ఉందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. పట్టణంలో ప్రజల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్లు ఎందుకని నిలదీశారు. పట్టణ ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. కార్యక్రమంలో సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌, పొట్రు శ్రీనివాసరావు, అర్జిల్లి రామకృష్ణ, బర్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:08 AM