Share News

వైసీపీని గద్దె దించేందుకు సిద్ధం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:50 AM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిం చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన-టీడీపీ-బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని చక్రద్వార బంధం, ముక్కినాడ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఎంవీ హరేరామ కృష్ణ, అనదాసు శేషయ్య, అనదాసు సాంబశివరావు, బి.శ్రీనివాస్‌, మహేష్‌, వినయ్‌, బి.శ్రీను, విజయకుమార్‌, వెంకటరమణ తదితరులు గురువారం జన సేనలో చేశారు.

 వైసీపీని గద్దె దించేందుకు సిద్ధం

  • కూటమి రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల

  • ఎంపీ భరత్‌రామ్‌కు ఓటమి భయం: వాసు

రాజానగరం/కోరుకొండ, మార్చి 28: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిం చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన-టీడీపీ-బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని చక్రద్వార బంధం, ముక్కినాడ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఎంవీ హరేరామ కృష్ణ, అనదాసు శేషయ్య, అనదాసు సాంబశివరావు, బి.శ్రీనివాస్‌, మహేష్‌, వినయ్‌, బి.శ్రీను, విజయకుమార్‌, వెంకటరమణ తదితరులు గురువారం జన సేనలో చేశారు. వారందరికి ఆయన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాటేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్య క్రమంలో భూషంశెట్టి అర్జున్‌, కురుమళ్ల మహేష్‌, గోవిందు తదితరులు పాల్గొ న్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బత్తుల మాట్లాడారు. రాజానగరం ప్రస్తుత ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అద్దె నియోజకవర్గమన్నారు. కొండలు, చెరువులు, ఇసుక, మట్టి దోచుకుపోవడం, నియోజకవర్గంలో బ్లేడ్‌బ్యాచ్‌, గంజాయి, క్రికెట్‌ బెట్టింగ్‌లను పెంచి పోషించడం అభివృద్ధి అంటారా అని బత్తుల ప్రశ్నించారు. ఎన్నికల ముందు డబ్బులు లేని వ్యక్తికి పదవి పూర్తయేటప్పటికి వందలాది ఎకరాలు, భవంతులు, తెలంగాణాలో లిక్కర్‌ సామ్రాజ్యం ఎక్కడదని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పిల్లలు చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జనసేన నాయకులు కమిడి శ్రీరాం, మేడిశెట్టి శివరాం, అడపా శ్రీనివాస్‌, నాతిపాం దొరబాబు, బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:50 AM