విల్లులా వంగుతారు!
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:10 AM
విల్లులా వంగగలరు.. పక్షిలా ఎగరగలరు.. చిరుతలా దూకగలరు.. శరీరాన్ని ఎటువైపైనా తిప్పగలరు.. వీళ్లే జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు.

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
విల్లులా వంగగలరు.. పక్షిలా ఎగరగలరు.. చిరుతలా దూకగలరు.. శరీరాన్ని ఎటువైపైనా తిప్పగలరు.. వీళ్లే జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు. వీళ్లం తా విభిన్న మార్గం ఎంచుకున్నారు. అందరిలా కాదు.. తాము ప్రత్యేకం అని నిరూపించుకునే మార్గంలో పయనిస్తున్నారు. మెరికల్లాంటి ఈ క్రీడాకారులు ఎక్కడో కాదు మన దగ్గరే ఉన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిల్లో తమ సత్తా చాటి ఒలింపిక్స్‌లాంటి వేదికలపై తమకంటూ ఒక గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నా రు. విద్యతోపాటే తమకు ఆసక్తికరమైన జిమ్నా స్టిక్స్ రంగంలో నైపుణ్యం సాధిస్తున్నారు.. దీనికి అనుగుణంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ నైపుణ్యం కలిపి వీళ్లంతా ఉన్నత శిఖరాలు అధి రోహించే దిశగా అడు గులు వేస్తున్నారు. కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో ఉన్న జిమ్నాస్టిక్స్ ఆడిటోరియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారు లు ఇప్పటికే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిల్లో ప్రతిభ కనబర్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగను న్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కఠోర శ్రమ చేస్తున్నా రు. విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపన ఈ క్రీడాకారులు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.
ఎల్‌కేజీ నుంచే శిక్షణ
రాష్ట్రంలోనే అతిపెద్ద జిమ్నాస్టిక్ ఆడిటోరి యం కాకినాడలో ఉంది. గుంటూరు తర్వాత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు జిమ్నాస్టిక్స్‌లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ప్రారంభంలోనే వాళ్ల శరీరాకృతి ఆధా రంగా దేనిలో రాణిస్తారో గుర్తించి వాటిలో శిక్షణ ఇస్తారు. తెల్లరేషన్‌కార్డు ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలకు ఇక్కడ శిక్షణ పూర్తిగా ఉచితం. మిగతావారికి నెలకు రూ.500 ఫీజు చెల్లించి శిక్షణ తీసుకోవచ్చు. వారి సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసి కేటగిరీల వారీగా శిక్షణ ఇస్తామని శిక్షకుడు సురేష్ తెలియజేశారు. ఒకపక్క చదువుపాటు జిమ్నాస్టిక్స్ శిక్షణలోను పాల్గొంటూ తమ నైపుణ్యాలను చాటుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులు అని చెప్పవచ్చు.
జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి
కాకినాడ మున్సిపల్ హైస్కూ ల్‌లో పదో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తితో ఇక్కడే శిక్షణ పొందుతున్నా. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాలన్నదే లక్ష్యం. - శివగణేష్ వీరబాబు
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
నేను కాకినాడ శ్రీప్రకాష్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో 4 బంగారు పతకాలు సాధించా. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి మంచి ఉద్యో గం సాధించాలనుకుంటున్నా. - మధులత
జాతీయస్థాయిలో రాణించాలని ఆశ
నేను ఐడియల్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిం చా. ప్రస్తుతం ఆ పోటీలకు రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్నా. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి మంచి పేరు తీసుకురావాలన్నదే నా ఆశయం.- జి.కావ్యసాయిశ్రీ
మంచిపేరు తీసుకు రావాలని ఉంది
ఆది విశాఖ జిల్లా గాజువాక. నేను కాకినాడ శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్నా. రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించా. జాతీ య, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఇక్క డ శిక్షణ తీసుకుంటున్నా. తద్వారా తల్లి దండ్రు లకు మంచి పేరు తీసుకురావాలని ఉంది.
- హిమవర్షిణి