తీరు మారాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:30 AM
’ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు.. ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామనుకుంటున్నారు..కూటమి ప్రభు త్వంలో పని చేస్తున్నామనే సంగతి అధికా రులు తెలుసుకోవాలి.
అధికారులు మారకపోవడంపై ఆగ్రహం
ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామనుకుంటున్నారా?
రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఇన్ని ఇబ్బందులా?
నియోజకవర్గాల్లో సమస్యలపై ఏకరవు
జడ్పీ సర్వసభ్య సమావేశంలో నాయకుల మండిపాటు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి); కాకినాడసిటీ:
’’ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు.. ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామనుకుంటున్నారు..కూటమి ప్రభు త్వంలో పని చేస్తున్నామనే సంగతి అధికా రులు తెలుసుకోవాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఒక్కో రకంలా నిబంధనలు ఎలా అమలు చేస్తారు’’ అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికా రులపై ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ వాకలపూడిలో పారిశ్రామిక కాలుష్య బుగ్గితో ప్రజలు నరకం చూస్తున్నారు. ఒక్కరోజు ఇంట్లో లేకపోతే బుగ్గి ఇళ్లల్లో పేరుకుపోతోంది. అటు నియోజకవర్గంలో అనేక చోట్ల కాలు వలు కనిపించడం లేదు..అధికారులు వెదికి పెట్టాలి అంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులకు చురకలం టించారు. వెరసి అధికారుల తీరుపై అధికార పక్ష ఎమ్మెల్యే ఆగ్రహాల మధ్య కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. సమా వేశా నికి మంత్రులెవరూ రాకపోవడంతో ముమ్మిడి వరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు విప్ హోదాలో సమావేశాన్ని జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆది నుంచే వాడివేడిగా..
వ్యవసాయం, జలవనరులు, వైద్య ఆరో గ్యం, డ్వామా, డీఆర్‌డీఏ, ఉచిత ఇసుక విధా నం తదితర అంశాలపై చర్చ జరిగింది. తొలుత వ్యవసాయశాఖపై చర్చ జరగ్గా ఉమ్మడి జిల్లాలో రైతులకు రబీ సాగులో నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు రబీకి సాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని సమావేశం నిర్ణయించింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రబీలో రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచా లన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిందన్నా రు. కానీ అధికారులు పాత విధానంలోనే ఉం డిపోయారని.. పేరు మార్పుపై క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రైతులు తమకు ఇష్టం వచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించాలన్నారు. కానీ అధికారులు మాత్రం రూల్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని మం డిపడ్డారు.ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లా డుతూ గ్రామ, మండల స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు జడ్పీ సమావేశం చక్కని వేదిక అని పేర్కొన్నారు. అటు ఎత్తిపోతల పఽథకం ప్రయోజనాలను ఒకసారి పర్యవేక్షిం చాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధికారులకు సూ చించారు.జలజీవన్ మిషన్ కింద ఎక్కడెక్కడో భూగర్భజలాలు తీసి తోడడానికి బదులు పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి గ్రావి టీ ద్వారా నీటిని సరఫరా చేసే విషయమై అధికారులు అధ్యయనం చేయాలని కోరారు.
కాలువపై..పేకాట క్లబ్బా..
ఇరిగేషన్ కాలువను కప్పెట్టేసి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేకాట క్లబ్ కట్టాడని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో కొన్ని ఇరిగే షన్ కాలువలు మాయమైపోయామని, అధికా రులు మాత్రం కాగితాల్లో వాటిని చూపుతు న్నారన్నారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో వెదికి చూపించాలని అధికారులకు చురకలంటిం చారు.రూరల్‌పరిధిలో వివిధ పరిశ్రమల నుం చి విడుదలవుతున్న కాలుష్యం వల్ల ప్ర జలు శ్వాసకోస సమస్యల భారినపడుతున్నా రన్నా రు. దీనిపై కలెక్టర్ షాన్‌మోహన్ మాట్లా డుతూ చుట్టుపక్క పరిశ్రమల నుంచి వస్తు న్న కాలుష్యంపై ఇప్పటికే శాంపిళ్లు సేకరించి పరిశీలనకు పంపామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.కాకినాడ రూరల్ జడ్పీటీసీ మాట్లాడుతూ వాకలపూడి ప్రాం తంలో ప్యారీషుగర్స్ నుంచి వచ్చే కాలుష్యంతో నరకం చూస్తున్నామన్నారు. తన నియోజక వర్గంలోని పీహెచ్‌సీలలో వైద్య సేవలు అం దుబాటులోకి తేవాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు.తాగు,సాగు నీరు కాలుష్యం అవుతున్నా అధికారులు పట్టించుకో వడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారా యణ మండిపడ్డారు.వ్యవసాయ, ఇరిగేషన్, డ్రైనేజీ కాలువల్లో పరిశ్రమలు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను వదలకుండా కట్టు దిట్టమైన చర్య లు చేపట్టాలన్నారు. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ చమురు తరలించుకుపోతున్న కంపెనీలు రాయల్టీ ఏపీకి కట్టడం లేదని, కట్టించేలా సభలో తీర్మానం చేయాలని కోరారు.
స్టడీ మెటీరియల్ ఇవ్వాలి..
జడ్పీ పరిధిలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సకాలంలో అందించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ స్లిప్పులు విడుదల చేయాలన్నారు. కారుణ్య నియామకాల ఖాళీ లను భర్తీ చేయాలన్నారు. ఉచిత ఇసుక ప్రయోజనం చేకూర్చే విధంగా చూడాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఇకపై సమావేశాలు సమయానికి జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలంతా కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ఏకైన శాఖ పంచా యతీరాజ్ అని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు పేర్కొన్నారు. కీలక అంశాలపై నాయకులు చేసిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని అధికారులతో సమ న్వయం చేసుకుని పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామన్నారు.సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్.చినరా ముడు, చింతూరు ఐటీడీఏ పీవో అనూర్వ భారత్, కోనసీమ జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో కె . మాధవి, ట్రైనీ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, డిప్యూటీ చైర్‌పర్సన్ మేరుగు పద్మలత, జడ్పీ సీఈవో లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్ మోహన్, ఏవో ఎం.బుజ్జిబాబు పాల్గొన్నారు.
===============================