Share News

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

ABN , Publish Date - May 10 , 2024 | 09:43 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

కాకినాడ, ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం. అయితే పోలీస్ డీజీపీ లాంటి పెద్ద పదవిలో ఉన్న వ్యక్తిని మార్చినప్పటికీ అధికారుల్లో ఇసుమంత కూడా మార్పు రాకపోవడం గమనార్హం. జగన్ ప్రభుత్వంపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే అధికారులు చాలా మందే ఉన్నారు. ఇదిగో దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జనసేన అధినేత పవన్ కల్యాణ్.


ఇదీ అసలు కథ..!

కాకినాడ సిటీలో (Kakinada City) పర్యటన, రోడ్ షో అనుమతి కోసం అధికారులకు పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి రాకపోవడం గమనార్హం. అనుమతి కోసం 48 గంటలుగా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. గురువారం నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన (TDP, Janasena) నేతలు పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు సాకులు చెబుతున్నారు.


ఎందుకిలా..?

అయితే.. రోడ్డు షోకు కాకినాడ నగరంలో ఎక్కడ అనుమతి ఇచ్చినా సమ్మతమేనని జనసేన, టీడీపీ నేతలు కోరారు. అయినా సరే అధికారులు నో చెప్పేశారు. ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా పర్మిషన్ ఇవ్వకపోవడం గమనార్హం. చూశారుగా.. అధికారుల తీరును బట్టి చూస్తే పరిస్థితి ఏంటనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అధికార దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. తమ అభిమాన నేతను చూడాలనుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, వీరాభిమానులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం అయినా సరే అనుమతి వస్తుందా అని ఎదురుచూపులు చూస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 09:47 PM