Share News

Pitapuram : ఇంకా ‘జగనన్న గోరుముద్దే’నా?

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:26 AM

వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటోల పిచ్చి పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

Pitapuram :  ఇంకా ‘జగనన్న గోరుముద్దే’నా?

  • చిక్కీ ప్యాకెట్లపై జగన్‌ నామ స్మరణపై విమర్శలు

పిఠాపురం, జూన్‌ 28: వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటోల పిచ్చి పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందించే చిక్కీ ప్యాకెట్లపైనా జగన్‌ ఫొటోలు ముద్రించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్‌ ఫొటోల స్థానంలో రాజముద్ర ముద్రించాలని, జగనన్న, వైఎ్‌సఆర్‌ పేర్లు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లాలో విద్యార్థులకు సరఫరా చేసేందుకు వచ్చిన వేరుశెనగ చిక్కీలపై ఇంకా జగనన్న గోరుముద్ద అంటూ ముద్రించడంపై సర్వత్రా ఆగ్రహం, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 20న తయారైనట్లు ఉన్న ఈ చిక్కీల ప్యాకెట్ల ముందు భాగంలో జగన్‌ ఫొటోల స్థానంలో రాజముద్ర ముద్రించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, వెనుకభాగంలో మాత్రం వెబ్‌సైట్‌ను ‘జగనన్నగోరుముద్ద’ పేరుతో ప్రింటింగ్‌ చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15వ తేదీనే దీన్ని ‘పీఎంపోషణ్‌’గా మార్పు చేశారు. కానీ అధికారులు మాత్రం ఇంకా ‘జగనన్నగోరుముద్ద’గానే ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా చిక్కీల ప్యాకెట్లపై ఇదే విధంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మార్పులేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

Updated Date - Jun 29 , 2024 | 05:26 AM