Excise department : రౌండాఫ్ పేరుతో బాదుడు
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:33 AM
కొత్త మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో అదనపు పన్నులు విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మద్యం సీసాల ధరల్లో రౌండాఫ్ విధానంపై స్పష్టతనిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో అదనపు పన్నులు విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మద్యం సీసాల ధరల్లో రౌండాఫ్ విధానంపై స్పష్టతనిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సీసా ధర కచ్చితంగా రూ.150, రూ.200 ఉంటే యథాతధంగా ఉంచుతారు. అదే రూ.155, రూ.156 ఉంటే దానిని రౌండాఫ్ చేసి రూ.160 చేస్తారు. అంతవరకు ఫరవాలేదు కానీ 150 రూపాయల 50పైసలుగా ధర ఉన్నప్పటికీ రౌండాఫ్ చేసి రూ.160 చేయాలని నిర్ణయించారు. ఇలా సున్నా తర్వాత అర్ధ రూపాయి పెరిగినా వినియోగదారులపై రూ.9.5 భారం పడుతుంది. అదే సీసా ధర రూ.90.5గా ఉంటే రౌండాఫ్ రూ.99 చేస్తారు.