AP Politics : టీడీపీలోకి ఆళ్ల నాని..!
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:33 AM
వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు.
మంతనాలు పూర్తి.. ఒకట్రెండు రోజుల్లో చేరిక
ఆయన దారిలోనే మరో ఇద్దరు వైసీపీ నేతలు?
ఏలూరు డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకే సిద్ధమవుతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయ్యి టీడీపీలో చేరిపోగా, ఆ పార్టీకి ఇంతకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా ఒకట్రెండు రోజుల్లోనే సైకిల్ ఎక్కనున్నారు. ఆళ్ల నాని రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని కొందరు, ఆయన జనసేనలో చేరతారని ఇంకొందరు చాలా కాలం క్రితం నుంచే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనిపై టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరో మాజీ మంత్రి శ్రీరంగనాఽథ రాజు వైసీపీని వీడబోతున్నట్టు ప్రచారం సాగుతూ వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ సానుకూలంగానే ఉన్నట్టు చెబుతున్నారు.