Share News

లోటు లేకుండా ఆహార ధాన్యాలు

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:39 AM

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆహార పంటల ఉత్పత్తులు నిరుడు కన్నా ఆశాజనకంగా ఉంటాయని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనా వేసింది.

లోటు లేకుండా ఆహార ధాన్యాలు

  • రాష్ట్రంలో ఈ ఏడాది పంటల ఉత్పత్తిలో వృద్ధి

  • నిరుడు కన్నా మిన్నగా వరి దిగుబడి

  • అపరాల దిగుబడిలోనూ పెరుగుదల

  • విస్తీర్ణం తగ్గినా గతేడాదిలాగే నూనెగింజల ఉత్పత్తి

  • ఖరీఫ్‌ పంటలపై ఆర్థ, గణాంక శాఖ మొదటి ముందస్తు అంచనా

అమరావతి, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆహార పంటల ఉత్పత్తులు నిరుడు కన్నా ఆశాజనకంగా ఉంటాయని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనా వేసింది. వరి, అపరాలు, నూనెగింజల్లో మెరుగైన దిగుబడులు రానుండగా, పత్తి, మిర్చి దిగుబడులు కొంత తగ్గుతాయని ఆశాఖ మొదటి ముందస్తు అంచనా నివేదికలో పేర్కొంది.

2023 ఖరీఫ్‌లో 24.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, 2024ఖరీఫ్‌లో 27.99లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో 32.50లక్షల హెక్టార్లలో మొత్తం పంటలు వేయాల్సి ఉండగా, సాగు విస్తీర్ణం కొంత తగ్గినాఉత్పత్తులు ఆశాజనకంగానే ఉంటాయని అంచనా వేసింది. ఎకరం వరిలో దిగుబడి నిరుడు సగటున 24 బస్తాలు రాగా, ఈ ఏడాది 26.85 బస్తాలకు పెరుగుతుందని అంచనా వేసింది. మొత్తం ఆహార ఉత్పత్తులు నిరుడు 18.81లక్షల హెక్టార్లలో 73.89లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తే.. ఈ ఏడాది 19.60లక్షల హెక్టార్లలో 79.17లక్షల టన్నులు ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది.


Untitled-8 copy.jpg

Updated Date - Oct 12 , 2024 | 04:48 AM