Share News

500 తాబేళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:16 AM

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.

500 తాబేళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

  • నర్సీపట్నం నుంచి ఒడిశాకు అక్రమ రవాణా

సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), సెప్టెంబరు 30: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాలు... నర్సీపట్నం నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు తాబేళ్లు రవాణా చేస్తున్నారని చిత్రకొండ అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని రాజుకొండ చెక్‌పోస్టు వద్ద రేంజ్‌ అధికారి బన్మాలి నాయక్‌ సిబ్బందితో నిఘా పెట్టారు. సోమవారం మధ్యాహ్న సమయంలో అటుగా వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా థర్మాకోల్‌ బాక్సుల్లో 500 తాబేళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తాబేళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు చిత్రకొండ అటవీ శాఖాధికారులు తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 05:16 AM