Share News

AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:21 PM

విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ (బుధవారం) రాజీనామా చేశారు. పరిపాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని, పాలనలో అంత దారుణంగా ఫెయిల్ అయిన పార్టీలో తాను ఉండలేనని రెహ్మాన్ ప్రకటించారు. మైనారిటీల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
YS Jagan

కీలక నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ విపక్ష పార్టీ వైసీపీకి మరో షాక్ గట్టి షాక్ తగిలింది. విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ (బుధవారం) రాజీనామా చేశారు. పరిపాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని, పాలనలో అంత దారుణంగా ఫెయిల్ అయిన పార్టీలో తాను ఉండలేనని రెహ్మాన్ ప్రకటించారు. మైనారిటీల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.


కాగా ఎస్ఏ రెహ్మాన్ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి కలిశారు. సాధారణ భేటీయేనని, పల్లాను అభినందించడానికి వచ్చానని రెహ్మాన్ చెప్పారు. అయితే ఆయన పార్టీ మారేందుకే వచ్చారని, ఈ మేరకు చర్చలు జరిపారంటూ కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలు నిజమయ్యి రెహ్మాన్ సైకిల్ ఎక్కుతారా? లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచిచూడాల్సి ఉంది.


టీడీపీలో సుధీర్ఘకాలం

కాగా ఎస్ఏ రెహ్మాన్ 1994లో నాటి విశాఖ-1 అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఉడా చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా చాలా కాలం కొనసాగారు. అయితే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపంపించి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరిగి 2014లో టీడీపీలోకి వెళ్లారు. అయితే 2019లో వైసీపీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. ఇటీవల అనివార్యమైన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధిష్ఠానం తనకే అవకాశం ఇస్తుందని రెహ్మాన్ ఆశించారు. కానీ బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేశారు. దీంతో రెహ్మాన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

Updated Date - Sep 25 , 2024 | 02:23 PM