Share News

AP News : మేము సైతం..

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:54 AM

వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు.

AP News : మేము సైతం..

  • బాధితులకు అండగా కదులుతున్న దాతృత్వం

  • ఏపీ జేఏసీ అమరావతి 120 కోట్ల భారీ విరాళం

  • రూ.కోటి ఇచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని

  • స్పందిస్తున్న సంఘాలు, పరిశ్రమలు, దాతలు, టీడీపీ నేతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం రూ.120 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన లేఖను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ప్రతినిధు లు గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు అందిం చారు. జేఏసీ పరిధిలోని 90 ప్రభుత్వ సంఘాలు, ఆర్టీసీ, కో ఆపరేటివ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఉపాధ్యాయ సం ఘాలు, పెన్షనర్ల సంఘాలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చాయి. బొప్పరాజు మాట్లాడుతూ.. ‘ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన చలో విజయవాడ సందర్భంగా విజయ వాడ ప్రజలు మాకు అండగా ఉన్నారు. వాకి ఔదార్యం మేం మరిచిపోలేం. ఉద్యోగులకు మంచినీళ్లు, మజ్జిగ, పాలు వంటివి అందించారు. ఈ రోజున మాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణి పేర్రాజు, సంఘం మహిళా విభాగం చైర్‌పర్సన్‌ పారె లక్ష్మి, ఆర్టీసీ నేత లు జీవీ నరసయ్య ఉన్నారు.

  • ఏపీ గెజిటెడ్‌ అధికారుల సంఘం...

ఏపీ గెజిటెడ్‌ అధికారుల సంఘం జేఏసీ.. రూ.8.10 కోట్లను సీఎం సహాయ నిధికి అందించింది. జేఏసీ అధ్యక్షులు కేవీ కృష్ణయ్య సీఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు.

  • పెమ్మసాని ఫౌండేషన్‌ కోటి

వరద బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కును కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సమక్షంలో అందజేశారు.


  • విజయ డైరీ రూ.50 లక్షలు

కృష్ణ మిల్క్‌ యూనియన్‌(విజయ డైరీ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. విజయవాడ నాలుగో డివిజన్‌లోని ఎన్టీఆర్‌, వెటర్నరీ కాలనీల అభివృద్ధి సంఘం సభ్యులు రూ.25 లక్షలు అందజేశారు. క్యాపిటల్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం సీఎం ఆర్‌ఎఫ్‌కు రూ.25 లక్షల విరాళాన్ని అందించింది. ఎండీ మన్నె హరీశ్‌, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వీఎస్‌ఆర్‌ భూపాల్‌ సీఎం చంద్రబాబును కలసి చెక్కును అందించారు.

  • ఐఏఎస్‌ అధికారుల భార్యల సంఘం విరాళం

ఐఏఎస్‌ అధికారుల భార్యల సంఘం రూ.5 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం చంద్రబాబును కలసిన సంఘం అధ్యక్షు రాలు, సీఎస్‌ సతీమణి రేష్మ ప్రసాద్‌, పద్మవల్లి తదితరులు చెక్కును అందజేశారు. కాగా, టీటీడీ ఉద్యోగ సంఘాలు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయిం చాయి. పామర్రు నియోజకవర్గానికి చెందిన కిలారపు శ్రీనివా సరావు రూ.10 లక్షల విరాళం అందజేశారు.

  • ఏయూ ఉద్యోగులు, పెన్షనర్స్‌ 63.59 లక్షలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, పెన్షనర్లు, కాంట్రాక్టు అధ్యాపకులు, మినిమం టైమ్‌ స్కేల్‌ ఉగ్యోగులు తమ ఒక్కరోజు మూల వేతనం రూ.63.59 లక్షలు అందిస్తారని వీసీ ప్రొఫెసర్‌ జి.శశిభూషణరావు తెలిపారు. విశాఖలోని సెంచరీ క్లబ్‌ ప్రతినిధులు రూ.10,00,116ల చెక్‌ను కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌కు అందజేశారు.

  • డ్వాక్రాల విరాళం రూ.5 లక్షలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు రూ.5 లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాయి. ఈమేరకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌కు చెక్కును గురువారం సాయంత్రం అందజేశాయి.

  • గోసలైట్స్‌ విరాళం రూ.35 లక్షలు

విజయవాడ గోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ చైర్మన్‌ నరేంద్ర రూ.25 లక్షలు, సంస్థ సిబ్బంది రూ.10 లక్షలు.. మొత్తం రూ.35 లక్షలను వరద బాధితులకు విరాళంగా అందించారు.

Updated Date - Sep 06 , 2024 | 05:54 AM