Share News

AP Govt : మంత్రులకు పీఆర్‌వోలనియామకానికి ఉత్తర్వులు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:12 AM

మంత్రుల కార్యాలయాల్లో పౌర సంబంధాల అధికారులు, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు, సోషల్‌ మీడియా అసిస్టెంట్ల నియామకానికి..

AP Govt : మంత్రులకు పీఆర్‌వోలనియామకానికి ఉత్తర్వులు

  • సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు, అసిస్టెంట్లు కూడా..

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మంత్రుల కార్యాలయాల్లో పౌర సంబంధాల అధికారులు, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు, సోషల్‌ మీడియా అసిస్టెంట్ల నియామకానికి అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది మంత్రుల కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా నియమించాలని ఆదేశించింది. పీఆర్‌వోలకు రూ.37 వేలు, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు రూ.50 వేలు, సోషల్‌ మీడియా అసిస్టెంట్లకు రూ.30 వేలు జీతాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. పీఆర్‌వోలకు ఏదైనా డిగ్రీ, జర్నలిజంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా జర్నలిజంలో అనుభవం ఉండాలని, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు బీటెక్‌, సోషల్‌ మీడియా అసిస్టెంట్లకు ఏదైనా డిగ్రీ విద్యార్హతలు ఉండాలని స్పష్టం చేసింది. అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొంది.

Updated Date - Dec 21 , 2024 | 04:12 AM