Share News

నేటి నుంచి ఈ-ఆఫీస్‌ తాత్కాలికంగా నిలిపివేత

ABN , Publish Date - Dec 21 , 2024 | 05:42 AM

రాష్ట్ర పరిపాలనలో ఫైళ్ల కదలికలకు వాడుతున్న ఈ-ఆఫీసును 8 రోజులపాటు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నేటి నుంచి ఈ-ఆఫీస్‌ తాత్కాలికంగా నిలిపివేత

అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిపాలనలో ఫైళ్ల కదలికలకు వాడుతున్న ఈ-ఆఫీసును 8 రోజులపాటు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీశాఖ ఆదేశాల మేరకు ఈ- ఆఫీస్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉందని సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 28 వ తేదీ ఉదయం 11 గంటల వరకు నిలిపివేసి, అప్‌గ్రెడేషన్‌ చేయనున్నట్లు తెలిపింది. అన్నిశాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ఈ 8 రోజులపాటు ఈ-ఆఫీ్‌సకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశించింది.

Updated Date - Dec 21 , 2024 | 05:42 AM