Share News

క్రీడలతో వ్యక్తిత్వ వికాసం

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:12 AM

వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ డాక్టర్‌ జి.కరుణాసాగర్‌ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్యపోటీలు ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రారంభమయ్యాయి.

క్రీడలతో వ్యక్తిత్వ వికాసం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ జి.కరుణా సాగర్‌

వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ కరుణాసాగర్‌

ఉత్సాహంగా వర్సిటీ క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు

బాపట్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ డాక్టర్‌ జి.కరుణాసాగర్‌ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్యపోటీలు ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో క్రీడలు అంతర్భాగాలన్నారు. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని, నిత్యం సాధన చేయాలని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌలిక అవసరాలను గుర్తించి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామన్నారు. విద్యార్థులు క్రీడలను తమ రోజువారి జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యూనియన్‌ బ్యాంక్‌ గుంటూరు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.జవహర్‌ మాట్లాడుతూ విద్యార్థి జీవితం అపురూపమైనదని, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూనారాణి, డాక్టర్‌ ఎన్టీఆర్‌ కాలేజి ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అసోసియేట్‌డీన్‌ డాక్టర్‌ ఎం.సర్దార్‌బేగ్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ డీడీ స్మిత్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషనల్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 01:12 AM