Chandrababu: టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ABN , Publish Date - May 13 , 2024 | 07:05 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) స్థానాలకు పోలింగ్ (Polling) జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. సోమవారం తెల్లవారు జాము 4 గంటలకే 64 వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అరాచక పాలనపై ఐదేళ్ల పాటు ఎంతో శ్రమించారని, నేడు కూడా అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపిచ్చారు.
ఓటమి భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు, ఫేక్ లెటర్లు సర్క్యూలేట్ చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితో వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమాచారం...
కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు
వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News