Share News

వసతి గృహాలు ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్‌

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:44 AM

పట్టణంలోని వసతి గృహాలను మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాధరెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.

వసతి గృహాలు ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్‌
ఎస్సీ వసతి గృహంలో వంట చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌

బాపట్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వసతి గృహాలను మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాధరెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్‌ జె.వెంకటమురళి ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్ధులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. బీసీ వసతిగృహం, ఎస్సీ బాలికల వసతిగృహం, బీసీ బాలుర వసతిగృహం, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం పరిశీలించి వార్డెన్‌, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన పదార్ధాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మార్కెట్‌ వద్ద ఉన్న బాలికల వసతిగృహంలో నిరుపయోగంగా ఉన్న ఆర్‌వో వాటర్‌ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అనంతరం వివేకానందకాలనీలోని మున్సిపల్‌ పార్క్‌ను పరిశీలించి సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. పెయింటర్స్‌ కాలనీలో మున్సిపల్‌ పార్క్‌ను పరిశీలించి పార్క్‌ సుందరీకరణకు కావాల్సిన అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కరుణ, శ్రీనుబాబు, ఇంజనీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:44 AM