Share News

Anagani: వాటిని మంత్రి లోకేష్ సరిదిద్దుతున్నారు..

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:23 PM

Telangana: మెగా పేరంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడంతో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాలు తగ్గిపోయాయన్నారు.

Anagani:  వాటిని మంత్రి లోకేష్ సరిదిద్దుతున్నారు..
Minister Anagani Satyaprasad

బాపట్ల జిల్లా, డిసెంబర్ 7: జిల్లాలోని చెరుకుపల్లి హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉల్లాసవంతమైన వాతావరణంలో చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకే పీటీఎంలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.

మీనాక్షి ఎలా చదువుతున్నావ్..


ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడంతో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాలు తగ్గిపోయాయన్నారు. హెచ్ఆర్డీ శాఖామంత్రిగా నారా లోకేష్ గత వైసీపీ పాలనలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను సరిదిద్దుతున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటింగులు నిర్వహించడం ప్రపంచంలోనే పెద్ద చరిత్ర అని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు.


హోంమంత్రికి ఘన స్వాగతం..

anitha-vangalapudi.jpg

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా యస్ రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన అనితకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించిన హోంమంత్రి అని.. ఆపై విద్యార్థులతో ఆప్యాయంగా మాట్టారు. కాగా.. జిల్లాలో పర్యటించిన హోంమంత్రి ముందుకు యస్ రాయవరంలో వెంకటేశ్వరస్వామి వారిని దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యస్ రాయవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు.

వామ్మో.. హైదరాబాద్ బిర్యానీనా


సమిష్టి కృషితోనే..: మంత్రి బీసీ జనార్దన్

bc-janardhan-reddy.jpg

నంద్యాలలోని బనగానపల్లి మండలం కొత్తపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అని ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ వెల్లడించారు.


ఉపాధ్యాయులను గౌరవించాలి: మంత్రి నాదెండ్ల

nadendla-manohar.jpg

విజయనగరం: ఉభయ జిల్లాలలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో పండగ వాతావరణం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘మన భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం మనకు గర్వకారణం. రానున్న 30 ఏళ్లలో మన పిల్లల చదువులు ఉద్యోగ, ఉపాధి కల్పనకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్నపూర్ణాదేవిగా ఖ్యాతి పొందిన డొక్కా సీతమ్మ పేరు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం సముచితం అని భావించాం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులను తల్లిదండ్రులు గౌరవించాలి’’ అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. అలాగే విజయనగరం జిల్లా జామి మండలం కుమరం హైస్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

Flights: గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానాలు..

బోరుగడ్డకి మరో దెబ్బ ఇక జైల్లోనే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 01:36 PM