Share News

రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడే అర్హత జగనకు లేదు

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:20 AM

రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడే అర్హత జగనకు లేదు

పెదకూరపాడు, నవంబరు 13 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అన్నారు. గుంటూరులోని పెదకూరపాడు నియో జకవర్గ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెం బ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై గళం విప్పలేని జగన కు బడ్జెట్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాషా్ట్రన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా బడ్జెట్‌ ఉంద న్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేసిన ఆర్థిక విధ్వంసం బయట పడుతుందనే భయంతో తప్పు డు లెక్కలు చెపుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నార న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే డీఎస్సీ నోటిఫికేషన విడుదలతో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన ఏర్పాటు, ఉచిత ఇసుక పథకాల ను అమలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకా రం మహిళలకు ఉచిత గ్యాస్‌ పథకాన్ని అమలు చేయటం తో పాటు సూపర్‌ - 6 పథకాలు అమలు చేసే దిశగా బడ్జెట్‌ ను రూపొందించిందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రపం చ స్థాయి కంపెనీలను రాషా్ట్రనికి ఆహ్వా నించేందుకు మంత్రి లోకేశ కృషి చేస్తు న్నారన్నారు. వైసీపీ పాలనలో కొత్త కంపె నీలు రాక పోగా కమిషనల కోసం వైసీపీ నాయకులు వేధించటంతో ఉన్న కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయా యని గుర్తు చేశారు. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన జగనకు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే అర్హ త లేదన్నారు. వైసీపీ పాలనలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు చంద్రబాబునాయుడు కష్టపడు తున్నారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో జగన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేటన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:20 AM