Share News

ఎన్టీఆర్‌ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:15 AM

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎన్టీఆర్‌ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాం
ఎన్టీఆర్‌ స్టేడియాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎన్టీఆర్‌ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ ేస్టడియంలో మున్సిపల్‌ కమిషనర్‌ పులి శ్రీనివాసులుతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. అనంతరం ేస్టడియంలోనే వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ట్రాక్‌ మొత్తం చిత్తడిగా మారిపోతుందని దాని వల న వృద్ధులు మహిళలు ఇబ్బందిపడుతున్నారని వాకర్లు ఎమ్మెల్యేకి తెలిపారు. టెన్ని స్‌ కోర్టులో లైటింగ్‌ సమస్య ఉందని, టేబుల్‌ టెన్నిస్‌ ఒక టేబుల్‌ మాత్రమే ఉంద ని, దానిని ఆరు టేబుల్స్‌కు పెంచాలని కోరారు. జిమ్‌ సెంటర్లోని పరికరాలు పాతవి గా ఉన్నాయని, వీటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని కోరారు. స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణ సరిగ్గా లేదని, ఆధునికీకరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దానిపై ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ కమిషనర్‌ పులి శ్రీనివాసులతో కలసి సమస్య లు లేకుండా చేసి, ేస్టడియంను అభివృద్ధి పరుస్తామని హామినిచ్చారు. కార్యక్రమం లో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్‌ ప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, దామచర్ల శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్‌, నరేంద్ర, వజ్జ రామకృష్ణ, లాల్‌వజీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 01:15 AM