Share News

భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:59 AM

కార్తీక పౌర్ణమికి సూర్యలంక సముద్రతీరానికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు.

భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి
సూర్యలంక సముద్రతీరంలో వసతులు పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ

బాపట్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి) : కార్తీక పౌర్ణమికి సూర్యలంక సముద్రతీరానికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. అధికారులతో కలిసి బుధవారం సూర్యలంక సముద్రతీరంలో ఏర్పాటు చేస్తున్న వసతులను ఆయన పరిశీలించారు. భక్తులకు అవసరమైన వసతులు గురించి అధికారులను అడిగి తెలుసుకొని వాటిని తక్షణమే ఏర్పా టు చేయాలని చెప్పారు. పౌర్ణమిరోజు లక్షలాది మంది భక్తులు తీరానికి వస్తుంటారు కావున ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. గజఈతగాళ్ళను అందుబాటులో ఉంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేయాలని చెప్పారు. పౌర్ణమిరోజు చేపట్టే హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనే విధంగా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జి.రఘునాధరెడ్డి, తహసీల్దార్‌ షేక్‌ సలీమా, డీఈపీవో ప్రభాకరరావు, ఈవోపీఆర్డీ పులి శరత్‌బాబు, సీఐ గంగాధర్‌, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:59 AM