వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:35 AM
వర్షాకాలం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చెప్పారు.
గుంటూరు, జూన 30(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చెప్పారు. పొన్నూరు రోడ్డు జున్ను షాహిద్ నగర్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని శివారు ప్రాంతమైన జున్ను షాహీద్ నగర్‌ను గడచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్ నిర్లక్ష్యం చేశారన్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఆ ప్రాంతం జలమయమైందన్నారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా నగరపాలక అధికారులు, ప్రజల సహకారంతో సైడు కాలువలు, రోడ్ల మరమ్మతు లు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.