Share News

బీఆర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:17 AM

గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ కోరారు.

బీఆర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలి

గుంటూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ కోరారు. ఆరో రోజు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరులో 1952లో స్థాపించిన బ్రహ్మానందరెడ్డి స్టేడియం శిఽథిలావస్థకు చేరిందని గతంలో 26ఎకరాలు ఉన్న ేస్టడియం ఆక్రమణలకు గురై 18 ఎకరాలకు వచ్చిందని వివరిం చారు. కూటమి ప్రభుత్వం బీఆర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. మున్సిపల్‌శాఖ మంత్రి, మున్సిపల్‌ సిబ్బంది స్టేడియంపై దృష్టి సారించాలని కోరారు. బ్రహ్మానందరెడ్డి ేస్టడియం మరమ్మతులు, అభివృద్థి కోసం ప్రభుత్వం డీపీఆర్‌లు తయారుచేసి ‘ఖేలో ఇండియా’ ద్వారా, మున్సిపల్‌శాఖ ద్వారా నిధులు కేటాయిం చాలని రెండు శాఖల మంత్రులను నసీర్‌ కోరారు.

Updated Date - Nov 19 , 2024 | 01:18 AM