Share News

VC Resign: నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:12 AM

గుంటూరు జిల్లా: నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తన పదవికి రాజీనామా చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న (శనివారం) ఆయన చాంబర్ ఎదుటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌కు తాళం వేసి నిరసన ప్రదర్శనలు చేశారు.

VC Resign: నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..

గుంటూరు జిల్లా: నాగార్జున యూనివర్శిటీ (Nagarjuna University) వైస్ ఛాన్సలర్ (Vice Chancellor) తన పదవికి రాజీనామా (Resignation) చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న (శనివారం) ఆయన చాంబర్ ఎదుట విద్యార్థి సంఘాలు (Student Unions) ఆందోళన (Protest) చేశారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌కు తాళం వేసి నిరసన ప్రదర్శనలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన వీసీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం.


కాగా ఏపీలో విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. నిన్నటి (శనివారం) వరకు ఎనిమిది మంది వర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు వైస్ ఛాన్సలర్‌లు రాజీనామా చేశారు. ఆచార్య నాగార్జున, విక్రమ సింహపురి వర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.


వైసీపీతో అంట కాగిన అనేకమంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేస్తున్నారు. మిగతా వారు కూడా మరి కొద్ది రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ప్రతిష్టించి వీసీలు స్వామిభక్తి చాటుకున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ర్యాలీ చేయించారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి మరీ అడ్డగోలుగా వ్యవహరించారు. ఈయనపై అనేక సార్లు గవర్నర్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

ప్రధాని మోదీ మన్ కీ బాత్ నేడు

భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 30 , 2024 | 10:12 AM