Share News

పెదలంకలో మన కడియం

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:19 AM

అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా రైతులు పంటలు సాగుచేస్తుంటారు.

పెదలంకలో మన కడియం
భట్టిప్రోలు మండలం పెదలంకలోని నర్సరీలో వివిధ రకాల మొక్కలు

ఫ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణాకూ మొక్కల సరఫరా

ఫ రైతులకు గిట్టుబాటు ధరకే విక్రయం

ఫ నలభై మందికి జీవనోపాధి

గతంలో మొక్కలు కా వాలంటే తూర్పుగోదావరి జిల్లా కడియంకు వెళ్ళి రైతులు తెచ్చుకునే పరిస్థితి ఉం డేది. ఇదంతా రైతులకు దూరా భా రం.. ఖర్చుతో కూడుకున్న వ్యవహా రం కావడం గమనించి.. తొమ్మిదేళ్ల క్రితం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం పెదలంకలో ఓ నర్సరీని వెంకట సురేంద్ర ఏర్పాటు చేశారు. వివిధ రకా ల పండ్ల మొక్కలు లభించే ఈ నర్సరీ ద్వారా పలువురికి జీవనోపాధి కూడా లభిస్తోంది. వ్యవసాయంపై మక్కు వతో ఈ ఆలోచన చేసిన వెంకటసురేంద్ర, మన ప్రాంతంలోనే నర్సరీ ఏర్పాటు చేశారు.

రేపల్లె, డిసెంబరు 9 (ఆంధ్రజ్యో తి): అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా రైతులు పంటలు సాగుచేస్తుంటారు. ఏడు దశాబ్దాల కాలంలో వ్యవసాయరంగంలో ఎన్నోమార్పులు చోటుచేసుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే సాంప్రదాయ వ్యవసాయం కంటే ఎక్కువమంది రైతులు ఉద్యాన వ్యవసాయం (హార్టీకల్చర్‌) వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ విధానంలో పంటల సాగు వలన అధిక పోషక విలువలు, ఖనిజాలు లభిస్తాయి. పర్యావరణ పరి రక్షణకు, పచ్చదనం మెరుగుకు తోడ్పడుతుంది. అంతేగాక, నీటివసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండ్ల తోటలను సాగుచేయవచ్చు. రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా ఉద్యాన సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదలంక గురించి తెలుసుకోవాలి. పెదలంకకు చెందిన వేములపల్లి వెంకటసురేంద్ర 30 ఎకరాల్లో అధునాత నర్సరీని ఏర్పాటుచేశారు. ఐదు వందలకు పైగా వివిధ రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఉన్నత విద్యా వంతుడు అయిన సురేంద్ర, వ్యవసాయంపై మక్కువతో ఉద్యాన వ్యవసా యంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు.

గతంలో మొక్కలు కావాలంటే తూర్పుగోదావరి జిల్లా కడియంకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ఆలోచన చేసిన వెంకట సురేంద్ర, మన ప్రాంతంలోనే నర్సరీ ఏర్పాటు చేయాలనుకున్నారు. అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంచితే, రైతులకు దూరాబారము తగ్గుతుందని, ఇక్కడ నర్సరీ ఏర్పాటు చేస్తే కూలీలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఆదా యాన్ని పెంపొందించుకోవచ్చని భావించారు.

కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో..

కృష్ణానది పరీవాహక ప్రాంతమైన పెదలంక గ్రామాల్లో రైతులు వాణిజ్య పంటలే కాకుండా లాభదాయకంగా ఉండే పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. జామ, మామిడి, గంగిరేవు, బత్తాయి, సపోట, వాటర్‌యాపిల్‌, పుచ్చకాయ, కొబ్బరి,నిమ్మ తదితర పంటలను సాగుచేస్తున్నారు. రెండేళ్లు కష్టపడితే ముప్పై ఏళ్ళపాటు ప్రతి ఏడాది ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా రైతులు ఆలోచన చేస్తున్నారు.

నర్సరీలో పలు రకాల మొక్కలు

నర్సరీలో విత్తనాల ద్వారా మొక్కలను తయారు చేయడంతో పాటు మొక్కలను పెంచేందుకు అంట్లు కట్టి మొక్కలను సిద్ధం చేస్తుంటారు. జా మలో 20 రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో నా టుజామ అలహాబాద్‌ సఫే, తైవాన్‌జామ, తైవాన్‌ పింకు జామ, మధురసఫేరా, దావల్‌సఫేరా, ఫిషర్‌ సఫేదా లాంటి మొక్కలు నర్సరీలో ఉంచారు.

నేరేడులో రకాలు

నే రేడులో ఏడు రకాలు మొక్కలు ఉన్నాయి. వాటిలో నాటు నేరేడు మొక్కలకు గింజ ఎక్కువ ఉండటంతో గుజ్జు తక్కువగా ఉండటం వల్ల పూ ర్తిస్థాయిలో నేరేడు పండ్లు తినే పరిస్థితి లేదు. సీ డ్‌లెస్‌ నేరేడులో ఐదు రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ధూబ్‌దాల్‌, ఏ85, సీడ్‌లెస్‌ నేరేడు,సీఏ ఎస్‌ఎఫ్‌42 అనే మొక్కల్లో సీడ్‌లెస్‌వి ఉన్నాయి.

మామిడి మొక్కల్లో 20 రకాలు

మామిడిలో 20 రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బంగినపండ్లు, చిన్నరసాలు, పెద్దరసాలు, పండూరి, కొబ్బరిమామిడి, కొత్తపల్లి, కొబ్బరిదర్శహరి, హిమైల్‌, కేసర్‌, అల్ఫాన్స్‌, అమరాపాని, మల్లిక, పునాసా, కాటిముని, ఎంగ్రిన్‌ ఆరెంజ్‌ వంటి రకాలు అందుబాటులో ఉంచారు.

ఐదడుగుల్లో కొబ్బరిమొక్కలు

గతంలో 30 నుంచి 50 అడుగుల కొబ్బరి చెట్లు ఉండేవి. కొబ్బరికాయలు కోయాలంటే నానా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఐదు నుంచి ఏడు, పది అడుగులు లోపే కొబ్బరిచెట్లు ఎదిగేలా, దిగుబడి అధికంగా ఇచ్చే కొబ్బరి చెట్లు అందుబాటులోకి ఉన్నాయి. నాటుకొబ్బరి, గంగాబోండా, కేరళగ్రీన్‌, మలేషియన్‌, గంగాబోండా మొక్కలు ఇక్కడ లభిస్తాయి. ఐదడుగుల గంగాబోండా మొక్క రెండేళ్లలో దిగుబడి ఇస్తుంది. మొదటల్లో దిగుబడి తక్కువగా ఉన్నా ప్రతి ఏటా దాని దిగుబడి క్రమేపి పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా మొక్కలను రైతులు, గృహయజమానులు పెంచుతున్నారు.

వివిధ రకాల పండ్ల మొక్కలు

నర్సరీలో దానిమ్మలో రెండు రకాల మొక్కలు ఉండగా సుఫర్‌, భగవన్‌, నాటు దానిమ్మ, హైబ్రీ డ్‌ దానిమ్మ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. సపోట మొక్కల్లో నాటు, పాట సపోట కాలపర్తి, బనానా సపోట, తైలాండ్‌ సపోటాలతో పాటు వాటర్‌ యాపిల్‌ల్‌లో సీడ్‌లెస్‌ మొక్కలు స్టార్‌ప్రూట్స్‌ పులుపు,తీపి మొక్కలు పనస మూడు రకాలు తైలాండ్‌ పిన్‌,బారయాన్‌జై33 మొక్కలు విక్రయిస్తున్నారు. టేకుచెట్లు, నిమ్మకాయ మొక్కల్లో బాలాజీ, నాటు, తైవాన్‌, బత్తాయిలో బత్తా యి, సద్గురి, మల్ఫాజఫా, మల్ఫాబర్పీ, వీఆర్త్‌నాద్‌,బ్రెజిల్‌ బత్తాయి, రేగిపండ్లు, కాశ్మీర్‌యాపిల్‌, దా ల్చినచెక్క, యాలకులు, సీతాఫలం, రామాఫలం, ల క్ష్మణఫలం, చింతకాయచెట్లతో పా టు వివిధ రకా ల పండ్లమొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మారేడు చెట్లు, దాల్చినచెక్క వంటి మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Dec 10 , 2024 | 01:19 AM