Share News

అమ్మానాన్నలకు ఆహ్వానం

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:10 AM

ఉమ్మడి జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే మహత్తర కార్యక్రమానికి సర్వం సిద్ధం అయింది.

అమ్మానాన్నలకు ఆహ్వానం

ఫ తల్లిదండ్రులు, గురువులు ఒకే వేదికపైకి.....

ఫ పాఠశాల, విద్యార్థి ప్రగతిపై ప్రత్యేకచర్చ

ఫ పాఠశాలల అభివృద్ధిపై దిశానిర్దేశం

ఫ ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి....

ఫ బాపట్ల జిల్లాలో పాల్గొననున్న సీఎం నారా చంద్రబాబునాయుడు

గుంటూరు(విద్య),డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే మహత్తర కార్యక్రమానికి సర్వం సిద్ధం అయింది. సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో జరిగే వేడుకల్లో పాల్గొని సమావేశాలను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఇక గ్రామస్థాయి నుంచి అన్ని పాఠశాలల్లో 7వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని ఒకే వేదికపైకి చేర్చి విద్యాపరమైన అంశాలు చర్చించి ప్రభుత్వ పాఠశాలల్ని మరింత బలోపేతం చేసే మహత్తర కార్యక్రమానికి విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాఠశాల స్థాయిలో విద్యార్థినీ విద్యార్థుల ప్రగతి నివేదికలు, వైద్య నివేదికలు సిద్ధ్దం చేశారు. కార్యక్రమ నిర్వహణ కోసం విద్యాశాఖ విద్యార్థుల సంఖ్యను అధారంగా నిధులు మంజూరు చేసింది.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, యూపీ, మండల పరిషత్‌ పాఠశాలలు దాదాపు 3,872 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు 6.97 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు విద్యాభాస్యం చేస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు సమావేశాల్లో పాల్గొనేలా ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానాలు పాఠశాల స్థాయి నుంచి హెచ్‌ఎంలు పంపారు.

పాఠశాల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి ఈ సమావేశాలు దిశానిర్దేశం చేయనున్నాయి. ఏటా పాఠశాల స్థాయిలో జరిగే తల్లిదండ్రుల సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుల్ని, తల్లిదండుల్ని పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుగా చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రతిగతి, పాఠశాల అభివృద్ది పర్యవేక్షించేలా కార్యచరణ సిద్ధం చేశారు.

ఫ పాఠశాలలో అభివృద్దికి అవసరమైన కోనుగోళ్ళ బడ్జెట్‌, సుందరీకరణ, పర్యావరణ పరిక్షణ, మరుగుదొడ్లు, విద్యార్థులు, ఉపాధ్యాయుల అంతర్గత సమస్యలు, మంచినీరు ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. .

ఫ విద్యార్థుల ప్రగతి, వారి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు అంటే శారీరక, మానసిక, కంటి సంబంధ సమస్యలు, పౌష్టికాహార లోపం వంటివి ఇందులో నివేదిస్తారు. కొన్నిచోట్లు ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఫ పాఠశాల పూర్తి అయిన తరువాత ఇంటి వద్ద విద్యార్థుల్ని ఎలా పర్యవేక్షించాలి? సెల్‌ఫొన్‌, టీవీలు, ట్యాబ్‌లు, ఇతర సామాజిక మాఽధ్యమాల వినయోగంపై నియంత్రణ ఎలా ఉండాలి? వంటి అంశాలుచర్చిస్తారు.

ఫ ప్రత్యేక సమావేశాల సందర్బంగా పాఠశాలల్లో విద్యార్థులకు , తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడానికే: డీఈవో సివిరేణుక

పాఠశాలల్లో జరిగే అభివృద్ది పనుల్లో, విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రుల్ని భాగస్వాములుగా చేయడానికే ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని డీఈవో ిసీవీ రేణుక వెల్లడించారు. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ ఉపాధ్యాయులకు, హెచ్‌ఎంలకు అందజేశామని వివరించారు. పండుగ వాతావరణంలో సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేణుక బుధవారం ’’ఆంఽధ్రజ్యోతి’’కి వివరించారు.

Updated Date - Dec 05 , 2024 | 01:10 AM