Share News

Draupadi Murmu: మీరంతా అత్యుత్తమ సేవలందించాలి

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:59 PM

Andhrapradesh: దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని.. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు.

Draupadi Murmu: మీరంతా అత్యుత్తమ సేవలందించాలి
President Draupadi Murmu

గుంటూరు, డిసెంబర్ 17: మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రధానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ‘‘పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్‌ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు’’ అని తెలిపారు.

ఇదేం పని ఎమ్మెల్యే గారూ.. వీడియో రచ్చ..


దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని.. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాన్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు.


ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి స్పష్టం చేశారు. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నజీర్ , సీఎం చంద్రబాబు, కేంద్ర ఆయూష్ మంత్రి ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు.

Year Ender 2024: వైసీపీ నేతల అరాచకానికి పరాకాష్ట.. ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..


గన్నవరం ఎయిర్‌పోర్టులో స్వాగతం..

కాగా.. ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. ఆపై గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి, గవర్నర్, సీఎం చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి...

టీడీపీలో ‘జోగి’ రచ్చ

తండ్రీకొడుకులకు బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 02:00 PM