Anagani: వారికి పూర్తి హక్కులు కల్పించడమే మా లక్ష్యం
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:47 PM
Andhrapradesh: వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోందని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్య పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య అని అన్నారు.
బాపట్ల జిల్లా, డిసెంబర్ 6: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మొత్తం 17 రెవెన్యూ గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల నిర్వహణ కార్యక్రమం జరుగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి.. వీలైనంత వరకు అక్కడిక్కడే సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీసుకున్న ప్రతి పిటిషన్‌కు రసీదు ఇస్తారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటెరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) పాల్గొని... గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు.
Nimmala: నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే వెన్నుపోటు.. జగన్‌పై మంత్రి ఫైర్
తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోందని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్య పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు వాళ్ళ స్వలాభం కోసమే చేసుకున్నారని ఆరోపించారు. భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కలిగించటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
అంతకుముందు ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో భూ సమస్యలు, ఎప్పుడు లేనన్ని అరాచకాలు జరిగాయని అన్నారు. సంస్కరణల పేరుతో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని మండిపడ్డారు. 67 వేల ఫిర్యాదు భూ సమస్యల మీద గ్రీవెన్స్ సెల్‌లో నమోదు అయ్యాయన్నారు. 17,500 గ్రామపంచాయతీలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పరిష్కారమయ్యే సమస్యలను అక్కడ అక్కడే పరిష్కరిస్తామని.. భూ సమస్యల విషయంలో అధికారుల తప్పు ఉందని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 33 రోజులపాటు ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తాం... అప్పటికి సమయం చాలకపోతే మరికొన్ని రోజులు పాటు పొడిగిస్తామన్నారు.
వచ్చిన ప్రతి సమస్యను ఆన్ లైన్‌లో నమోదు చేస్తామన్నారు. ఏ సమస్య వల్ల పరిష్కారం కాలేదో వాటి వివరాలు కూడా తెలుపుతామన్నారు. భూ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రీ సర్వే, రిఫార్మ్ ను వైసీపీ ప్రభుత్వం తమ స్వలాభాలకు వాడుకున్నారని ఆరోపించారు. తప్పులు తడకగా వైసీపీ ప్రభుత్వం పాస్ బుక్కులు మంజూరు చేశారన్నారు. జగన్‌కు పాస్ బుక్కుల మీద ఫోటో వేసుకోవాలన్న ఆత్రం తప్ప.. సమగ్ర వివరాలతో ఇవ్వాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. రాజ ముద్ర వేసిన సమగ్ర వివరాలతో ఉచితంగా పాస్ పుస్తకలు ఇస్తామన్నారు. రీ సర్వే సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల అరవై వేల కంప్లైంట్స్ వచ్చాయన్నారు. కోర్టు పరిధిలో లేని భూ వివాదాలనే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులు సక్రమంగా నిర్వహించకపోతే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
అలా చేస్తే శిక్ష తప్పదు: మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలోని ఏసీ నగర్‌లో జరిగిన రెవిన్యూ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 33 రోజులు పాటు రాష్ట్రంలో రెవిన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సెంటు భూమి నుంచి ఎకరాల్లో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులని కూడా కబ్జా చేశారని తెలిపారు. అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ల్యాండ్ గ్రాఫింగ్ ప్రైవేన్షియల్ బిల్ తీసుకొచ్చామన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా నాన్ బెయిల్ క్రింద 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదని మంత్రి నారాయణ వెల్లడించారు.
జగన్‌కు యార్లగడ్డ కౌంటర్
కృష్ణాజిల్లా బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యార్లగడ్డ వెంకట్రావు తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కుని మహిళలకు 50% చేశారని.. మాజీ సీఎం జగన్ రాజ్యాంగం ప్రకారం షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోరారన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు వల్ల ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు గుంటలు పూడ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. రాష్ట్ర మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులు ఎక్కవ తారుమారు చేశారని తెలిపారు. గత10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసిన ఎమ్మార్వోలు తప్పులు చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్
Read Latest AP News And Telugu News