Share News

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:05 AM

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో కీలక భూమిక పోషించిన పోలీసులు, కేంద్ర బలగాలు, తమిళనాడు పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ శెబాష్‌ పోలీస్‌ అంటూ అభినందించారు.

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

గుంటూరు, జూన్‌ 5 : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో కీలక భూమిక పోషించిన పోలీసులు, కేంద్ర బలగాలు, తమిళనాడు పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ శెబాష్‌ పోలీస్‌ అంటూ అభినందించారు. నేటితో ఎన్నికల కోడ్‌ ముగిసి ఆయా బలగాలు వెనుతిరగ నుండడంతో ఎస్పీ వారందరినీ అభినందించారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో పాలు పంచుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఆయన హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన దగ్గరి నుంచి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్‌ బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి, కేంద్ర, రాష్ట్ర బలగాలు, ఇతర శాఖల అధికారుల కృషి, ేసవలకు అభినందనలు తెలిపారు. పోలీంగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలు , రాజకీయ పార్టీలు, మీడియాకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 01:05 AM