రైళ్ల రద్దు, దారి మళ్లింపు
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:52 AM
కాజీపేట - విజయవాడ సెక్షన్‌లో మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా గుంటూరు నుంచి ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఏ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాజీపేట - విజయవాడ సెక్షన్‌లో మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా గుంటూరు నుంచి ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఏ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు. 12705 గుంటూరు - సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, నంబరు. 12706 సికింద్రాబాద్ - గుంటూరు రైలును ఈ నెల 28, 29, జనవరి 2, 5, 7, 8, 9 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు. నంబరు. 17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ్ ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 27 నుంచి జనవరి 9వ తేదీ వరకు కాజీపేట వరకే నడిపి వెనక్కు మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుంచి జనవరి 8వ తేదీ వరకు నంబరు. 18519 విశాఖపట్టణం - ముంబై ఎల్‌టీటీ, జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు నంబరు. 18045 షాలిమార్ - హైదరాబాద్, జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు నంబరు. 18046 హైదరాబాద్ షాలిమార్, నంబరు. 17205 సాయినగర్ షిర్డి - కాకినాడ పోర్టు రైలుని జనవరి 7న, నంబరు. 17206 కాకినాడ పోర్టు - సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 8న, నంబరు. 17207 సాయినగర్ షిర్డి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 8న, నంబరు. 17208 మచిలీపట్నం - సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 7న విజయవాడ - గుంటూరు - పగిడిపల్లి - సికింద్రాబాద్ - వికారబాద్ మీదగా దారి మళ్లించడం జరుగుతుందన్నారు. నంబరు. 11019 ముంబై సీఎస్‌ఎంటీ - భువనేశ్వర్, నంబరు. 11020 భువనేశ్వర్ - ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు, వాడి - వికారాబాద్ - సికింద్రాబాద్ - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదగా దారి మళ్లిస్తామన్నారు. నంబరు. 22849 షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 1, 8 తేదీల్లో, నంబరు. 20833 విశాఖపట్టణం - సికింద్రాబాద్ విజయవాడ - గుంటూరు - పగిడిపల్లి -సికింద్రాబాద్ మార్గంలో దారి మళ్లిస్తామని తెలిపారు. నంబరు. 12774 సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌ని జనవరి 7న రాజమండ్రి - విజయవాడ - గుంటూరు - పగిడిపల్లి - సికింద్రాబాద్ మీదగా దారి మళ్లిస్తామన్నారు. ఆపరేషనల్ కారణాల వలన ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నంబరు. 07276 కాచీగూడ - మిర్యాలగూడ, నంబరు. 07277 మిర్యాలగూడ - నడికుడి, ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు నంబరు. 07973 నడికుడి - మిర్యాలగూడ, నంబరు. 07974 మిర్యాలగూడ - కాచీగూడ రైళ్లను రద్దు చేశామన్నారు. నంబరు. 07791 కాచీగూడ - నడికుడి, నంబరు. 07792 నడికుడి - కాచీగూడ రైలుని ఈ నెల 26 నుంచి జనవరి 28వ తేదీ వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.