Share News

అమ్మ పేరుతో చెట్టు పెంచండి

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:06 AM

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వన మహోత్సవం ఉమ్మడి జిల్లాలో కోలాహలంగా జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని ఎకో పార్కులో ప్రారంభించారు. మొక్కలు నాటి స్థానిక ప్రజలతో మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో మొక్కలు నాటారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అసలు వన మహోత్సవ కార్య క్రమం సీఎం నరసరావుపేటలో ప్రారం భించాల్సి ఉంది. స్థానిక అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. అయితే శుక్రవారం వర్షం కారణంగా, అక్కడ కార్య క్రమాన్ని రద్దు చేసి, మంగ ళగిరిలో నిర్వ హిం చడం గమనార్హం.

అమ్మ పేరుతో చెట్టు పెంచండి
వనమహోత్సవంలో మొక్కలు నాటి నీరు పోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌,

గుంటూరు, మం గళగిరి ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ’మంగళగిరి ఎకో పార్కును చూస్తే ఎంతో ఆనందం కలి గింది. సుందరమైన అడవి.. పక్కనే ప్రతి ష్టాత్మమకమైన ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎయిమ్స్‌ భవనాలు.. మరో పక్కన బెటాలి యన్‌.. ఇవన్నీ చూస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావ రణం కనిపిస్తోంది. అమరావతి నడిబొడ్డున ఇలాంటి అద్భుతమైన ఎకో పార్కు వుందంటే చాలా సంతోషంగా వుంది. నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్లుంది. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఇల్లు కట్టుకోవాలనిపిస్తోంది. అంత సుందరంగా, కళ్లకు ఆకర్షణీయంగా ఈ పార్కు కనిపిస్తోంది.’ అంటూ మంగళగిరి ఎకో పార్కుపై ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఎకో పార్కులో ప్రస్తుతం రోజుకు 300 మంది వస్తున్నారని, రానున్న రోజుల్లో ఆ సంఖ్య 3000కు పెరగాలని ఆకాం క్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా నరసరావుపేట జేఎన్‌టీయూలో జర గాల్సిన కార్యక్రమాన్ని అప్పటికప్పుడు మంగళగిరిలోని ఎకో పార్కులో నిర్వహించారు. అప్పటికప్పుడు ఏర్పా టు కార్యక్రమం అయినప్పటికీ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా సాగింది. కార్యాక్రమానికి అర్ధగం ట ముందే వచ్చిన రాష్ట్ర అటవీశాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎకో పార్కులో కలియదిరిగారు. తనను కలవ డానికి ప్రయత్నించిన అభిమాను లు, ఉభయ పార్టీల కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. వారితో కలిసి తిరిగారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో ఆయనతో కలిసి ఎకో పార్కును పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, తాడికొండ ఎమ్మెల్యే, అటవీశాఖ అధికారులు, మంగళగిరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా నిర్వహించిన కార్యక్ర మంలో సంప్రదాయానికి భిన్నంగా సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో విద్యార్థులు వన మహోత్సవ ప్రమా ణం చేయించారు. ప్ర మాణం చేయించిన మంగళగిరి మున్సిపల్‌ హై స్కూలు చిన్నారిని ఆయన, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తు వారిదే కాబట్టి వారి ద్వారా తాము ప్రమాణం చేశా మని ఈ సందర్భంగా చంద్ర బాబు చెప్పారు. అనం తరం ఆయన మాట్లాడుతూ సభలో నవ్వు లు పూయించారు. మారిన ముఖ్య మంత్రిగా చమత్కారాలతో అందరినీ అహ్లా దపరుస్తూ విద్యా ర్థులకు కర్తవ్యాలు బోఽ దించారు. ప్రజలకు తమ బాధ్యతలు గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యా లను ఎండగడుతూ, వ్యవస్థల విధ్వంసం, వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్ర జలకు, ప్రధానంగా చిన్నారులకు మంచి భవిష్యత్తును హామీ ఇచ్చారు.

తల్లి రుణం తీర్చుకునేందుకు ఇదో అవకాశం

ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి.. ఆ మొక్కకు తల్లిపేరు పెట్టండి. మనకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. నేను పవన్‌ కల్యాణ్‌ మళ్లీ మీ దగ్గరకి వస్తాం. అప్పుడు మీరు నాటిన మొక్కను మాకు చూపించాలి. పేరు అడిగితే మీ అమ్మపేరు చెప్పాలని చంద్రబాబు వన మహోత్సవం సందర్భంగా చిన్నారుల వద్ద హామీ తీసుకున్నారు. గత ముఖ్యమంత్రిలాగా రాళ్ల మీద తన బొమ్మ వేసుకోబోమని ఎద్దేవా చేశారు. ఎవరు నాటిన మొక్కకు వారే తమ తల్లి పేరు పెట్టుకోవచ్చని చమత్కరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండేసి మొక్కలు నాటితే ఏడాదికి పది కోట్ల మొక్కలు అవుతాయన్నారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంకల్పిం చినట్లు 50 శాతం పచ్చదనాన్ని సాధించవచ్చన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ ఏడాది కోటి మొక్కలతో ప్రారంభిస్తున్నామన్నారు. తద్వారా ఏడాదికి 0.33 శాతం పచ్చదనం పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకోటూరిజం సెంటర్లు, 175 నియోజకవర్గాల్లో జపనీస్‌ టెక్నాలజీ, నరేగా డబ్బులు వినియోగించి నగర వనాలను నిర్మిస్తామన్నారు. తద్వారా పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు 50 శాతం పచ్చ దనం వస్తుందన్నారు. అదే అసలైన స్వర్ణాంధ్రప్రదేశ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌కు నిధుల కొరత లేదని, ఆయన చేతిలో నరేగా, అటవీ శాఖలు వున్నాయని, వాటి అనుసంధానంతో అడవుల పెంపకం ఎంతో సులువ వుతుందన్నారు. ఇలాంటి మా కొత్త ఆలోచనలను కేంద్ర మంత్రి పెమ్మ సాని సాకారం చేసే దిశగా కేంద్రంలో కృషి చేయాలన్నారు. నగర వనాల నిర్మాణాల్లో భాగమయ్యేం దుకు ముందుకు వచ్చేవారి సహాయం తీసుకుంటా మన్నారు.

ఫ పులులను చూడాలంటే పవన్‌ కల్యాణ్‌ను అడగాల్సిందే..

నాగార్జున సాగర్‌, శ్రీశైలం దగ్గర 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పులుల శాంక్చురి వస్తుందని చంద్రబాబు చెప్పారు. అక్కడ 80 పులులు వుంటాయని, అద్భుతమైన సఫారీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. పులులను చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదని నాగార్జున సాగర్‌ వెళ్లి పవన్‌ కల్యాణ్‌ను తలుచుకుంటే చాలని చమత్కరించారు. రాష్ట్రంలో 13 వన్యప్రాణీ సంరక్షణ కేంద్రాలు, మూడు నేషనల్‌ పార్లుకు, రెండు జూలాజికల్‌ పార్కులు వున్నాయని, ఒక టైగర్‌ పార్కు, ఒక ఏనుగుల శాంక్చురి వచ్చే అవకాశం వుందని చెప్పారు.

ఒక చెట్టు పది మంది కొడుకులతో సమానం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా తనకు ఈ కార్యకక్రమం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వరుణ దేవుడు కూడా తన శుభాశీస్సులు అందించార న్నారు. హరితాంధ్రప్రదేశ్‌ సాధించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన బాధ్యత అన్నారు. చెట్లు నరకడం తేలికే.. పెంచడం కష్టమన్నారు. గత ముఖ్యమంత్రి వందల చెట్లు నరికేశాడని, తాము అలా కాదన్నారు. ప్రతి దేవాలయం, మసీదు, చర్చి, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెంచు తామన్నారు. ఒక చెట్టు పది మంది కొడుకులతో సమా నమని అరణ్యసూక్తం చెప్పిందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టును పెంచే బాధ్యత తీసుకో వాలన్నారు. జపాన్‌కు చెందిన మియావకి పద్ధతిలో అనతి కాలం లోనే దట్టమైన అడవులు పెంచవచ్చని, ఆ పుస్తకాలను అందరి కీ అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విత్తనం నాటిన తరువాత అది ఎన్నో అవాం తరాలను అధిగమించి మొక్కై, మహా వృక్షమై ఎదు గుతుందన్నారు. అది ప్రగతికి చిహ్నమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరామ్‌, కలెక్టర్‌ నాగలక్ష్మి, తాడి కొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ చం ద్రగిరి ఏసురత్నం, గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, టీడీపీ నేత తమ్మిశెట్టి జానకీ, స్థానిక ప్రజ లు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 12:06 AM