సాగు ఎన్నికలకు.. రీ షెడ్యూల్
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:03 AM
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శుక్రవారం రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 21న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
వచ్చే నెల 5న నోటిఫికేషన్ విడుదల
8న నీటి సంఘాలకు, 11న డీసీలకు ఓటింగ్
14న ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకునేలా ఉత్తర్వులు
(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శుక్రవారం రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 21న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 5న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 8న సాగునీటి సంఘాలకు, 11న డిసి్ట్రబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ కుడి కాల్వ పరిధిలో మేజర్, మైనర్ ఇరిగేషన్‌లో 274 సాగు నీటి సంఘాలు(డబ్ల్యుయూఏ) ఉన్నాయి. ఒక్కొక్క సంఘం పరిధిలో 12 టీసీల చొప్పున మొత్తం 2,628 టీసీలు ఉన్నాయి. టీసీల వారీగా ఓటర్ల జాబితాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. దాదాపు 7 లక్షల మంది రైతులు ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కొక్క టీసీ పరిధిలో 2,500 నుంచి 3,000 మంది రైతులు ఓటర్లుగా నమోదయ్యారు. టీసీలకు 8న ఎన్నికలు నిర్వహించన్నారు. అదే రోజు సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. నీటి సంఘాలకు కాల్వ ఎగువ భూముల పరిధిలోని టీసీని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దిగువ భూముల టీసీని ఉపాధ్యక్షుడిగా ఎన్నికుంటారు. నీటి సంఘాల అఽధ్యక్షులు, ఉపాధ్యక్షులు డిసీ్ట్రబ్యూటరీ కమిటీని ఎన్నికుంటారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలో 32 డిసి్ట్రబూటరీ కమిటీలు ఉన్నాయి. డీసీలు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటాయి. వీటికి నోటీఫికేషన్‌ను 5న విడుదల చేయనున్నారు.
14న ప్రాజెక్టు కమిటీకి ఎన్నిక
సాగర్ కుడి కాల్వ ప్రాజెక్టు కమిటీకి 14న ఎన్నికల నిర్వహించనున్నారు. 32 డీసీల అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణకు సాగు నీటి సంఘాల వారీగా అధికారులను నియమించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అఽధికాలు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక నీటి సంఘాల ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను అధికారులు కోరారు. రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా స్వీకరిస్తుండటంతో ఏకగ్రీవ ఎన్నికలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎక్కువ నీటి సంఘాలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.
డిసీ్ట్రబూటరీ కమిటీలు ఇవే..
నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలో 32 డిసీ్ట్రబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. నీటి పంపిణీలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. డీసీలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డీసీల వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల, గురజాల, కారంపూడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల, తంగెడ, బెల్లంకొండ, క్రోసూరు, చామర్రు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి, ఫిరంగిపురం, గుంటూరు, పొన్నెకల్లు, లింగంగుంట్ల, చిలకలూరిపేట-1,2, పెదనందిపాడు, సంతగుడిపాడు, రొంపిచర్ల, గంటావారిపాలెం, వినుకొండ, చీకటీగలపాలెం, ఐనవోలు, త్రిపురాపురం, ములకలూరు, సంతమాగులూరు, కొమ్మాలపాడు డీసీలు ఉన్నాయి.