Share News

సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:36 AM

ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఎన్నికలకు అధికారులు సిద్ధమవగా.. తమకు గ్రామాల్లో పట్టు ఉందని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుండగా ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదల చేయాల్సిన నోఫికేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.

సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

నేడు విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ నిలిపివేత

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

సిద్ధమైన ఓటర్ల జాబితాలు.. ఏడు లక్షల మందికి ఓటు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఎన్నికలకు అధికారులు సిద్ధమవగా.. తమకు గ్రామాల్లో పట్టు ఉందని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుండగా ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదల చేయాల్సిన నోఫికేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎన్నికలను ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. తదపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నీటి వినియోగదారుల సంఘాల(డబ్ల్యూయూఏ) పరిధిలోని టీసీల వారీగా రైతుల జాబితాలను సిద్ధం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 274 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటి పరిధిలో 2,628 టీసీలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం పరిధిలో దాదాపు 12 టీసీలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం పరిధిలో 2,500 మంది నుంచి 3,000 వరకు రైతులను ఓటర్లుగా నమోదు చేశారు. సుమారు ఏడు లక్షల మందిని ఓటర్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు 2,628 టీసీల వారీగా ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేశారు. తొలుత టీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వ ఆదేశాలతో నోటిఫికేషన్‌ నిలిచిపోయింది. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ పరిధిలో 32 డిసీ్ట్రబ్యూటరీ కమిటీలు ఉండగా కైవాసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

Updated Date - Nov 21 , 2024 | 01:36 AM