Share News

Gurukulam Problems : గురుకులం - సమస్యల వలయం

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:23 PM

దేవపట్లలోని శ్రీబాలయో గి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సమ స్యలు చుట్టుముట్టాయి. విద్యార్థులకు కనీస మౌలి క వసతులు లేవు. తాగునీటి కోసం అవస్థలు పడు తున్నారు. రోజూ పక్కన ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫ రా చేస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 418 మంది విద్యార్థులున్నా వీరికి సరపడా మరు గుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు తోడు మరో 30 మరుగుదొడ్లు అవసరం. బాలికల గురుకులాల్లో ప్రధానంగా నీటి సమస్య లేకుండా చూడాలి.

Gurukulam Problems : గురుకులం - సమస్యల వలయం
నిర్మాణం పూర్తికాక నిరుపయోగంగా డార్మెటరీ భవనం

వసతులకు నిధులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

మూడు నెలలుగా రాని టీచర్ల జీతాలు

ఏళ్ల తరబడి పూర్తి కాని భవనాలు

ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

సంబేపల్లె, సెప్టెంబరు29: దేవపట్లలోని శ్రీబాలయో గి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సమ స్యలు చుట్టుముట్టాయి. విద్యార్థులకు కనీస మౌలి క వసతులు లేవు. తాగునీటి కోసం అవస్థలు పడు తున్నారు. రోజూ పక్కన ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫ రా చేస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 418 మంది విద్యార్థులున్నా వీరికి సరపడా మరు గుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు తోడు మరో 30 మరుగుదొడ్లు అవసరం. బాలికల గురుకులాల్లో ప్రధానంగా నీటి సమస్య లేకుండా చూడాలి. వీరం తా గ్రామీణ మారుమూల ప్రాంత విద్యార్థులు. విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. డార్మెటరీ, ప్రయోగశాలలు లేవు. తరగతి గదుల కోసం నిర్మించిన భవనంలోనే విద్యార్థులు సర్దుకుంటున్నారు. ప్రభుత్వాలు మారి నా పాఠశాల పరిస్థితులు మాత్రం మారడం లేదు.


25rct25.gifచెదులుపట్టిన తలుపులు, కిటికీ సామగ్రి

ఏళ్ల తరబడి నిర్మాణంలోనే...

దేవపట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం 2010-11 విద్యా సంవత్సరంలో డార్మెటరీ నిర్మాణం మంజూరు చేశా రు. సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు సకాలంలో పూర్తి చేయక నేటికీ దిష్టిబొమ్మల్లా నిరుపయోగం గానే ఉంది. డార్మెటరీ నిర్మాణం కోసం సరఫరా చేసిన సామగ్రి తలుపులు కిటికీలు చెదులు పడుతున్నాయి. నిర్మాణం కోసం సరఫరా చేసిన సిమెంటు గడ్డకట్టింది. ఇప్పటికీ డార్మెటరీ నిర్మాణం పూర్తికాలేదు. ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రయోగశాల గదులను మంజూరు చేశారు. వాటి నీ పూర్తి చేయలేదు. ఉన్న తరగతి గదుల్లోనే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని వినియో గించుకుంటున్నారు. దీంతో పాటు భోజనశాల అదనపు గదులను కూడా మంజూరు చేశారు. వాటి నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. అధికారులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో ఖర్చు చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. వీటి నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులను ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

వసతులకు చెల్లిగవ్వలేదు

గురుకులంలో విద్యార్థులకు తాగునీరు, మరుగు దొడ్ల సమస్య ఉంది. కనీసం విద్యార్థుల వసతి కోసం ఒక రూపాయి ఖర్చు చేస్తామన్న చిల్లిగవ్వ లేదు. వైసీపీప్రభుత్వంలో నిధులే కేటాయించలేదు. పాఠశాల ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు రాని పరిస్థితి గురుకు లంలో సొంత డబ్బు పెట్టి విద్యార్థుల మౌలిక వసతులను తీరుస్తు న్నాం. నిధులు కేటాయించి విద్యార్థులకు వసతులు సమకూర్చాలని బాధ్యత ఉంది.

శశికళ, ప్రిన్సిపాల్‌, గురుకుల పాఠశాల, దేవపట్ల

Updated Date - Sep 29 , 2024 | 11:23 PM