చిరుధాన్యాలతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:22 PM
చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అందరు ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎంపీడీవో శ్రీధర్‌రావు, అంగన వాడీ సూపర్‌వేజర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు.
పెద్దమండ్యం, సెప్టెంబరు 13ః చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అందరు ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎంపీడీవో శ్రీధర్‌రావు, అంగన వాడీ సూపర్‌వేజర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. మండలంలోని కోటకా డపల్లి, గుర్రంవాండ్లపల్లి, బండమీదపల్లి, సిద్దవరం, ఎనవోల్లి గ్రామా లలోని అంగనవాడీ కేంద్రాలలో మాసోత్సవాలు జరిగాయి. ఈ సంద ర్భంగా తాటిమాకులపల్లి అంగనవాడీ సూపర్‌వేజర్ నాగలక్ష్మీ మాట్లాడుతూ సద్దలు, రాగులు, సామలు, జొన్నలు పలు చిరుధాన్యాల ఆహారం తోనే మన పెద్దలు ఆరోగ్యవంతులుగా జీవితం గడిపినందుకు మనం వారికి ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పెద్దతిప్పసముద్రంలో : బి.కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోట పంచాయతీలోని పెద్దపొం గుపల్లె అంగనవాడీ కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవా లను నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ నాగరత్నమ్మ మాట్లాడుతూ గర్బవతులు ప్రారంభ దశ నుండే సరైన పౌష్గికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆకుకూరలు, కూరగా యలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలతో స్టాల్‌ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్తలు శంకరమ్మ, శాంతమ్మ, నిర్మల, జయసుధ, హెల్పర్లు పాల్గొన్నారు.