Narayana Swamy: డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో హీటెక్కిన రాజకీయం
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:38 PM
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత నియోజకవర్గం గంగాధర్ నెల్లూరులో సొంత పార్టీలోనే రాజకీయం హీటెక్కింది. నారాయణస్వామి వ్యతిరేక, అనుకూల వర్గాలు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. దీంతో అధికార వైసీపీ పరువు వీధిన పడింది.
చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత నియోజకవర్గం గంగాధర్ నెల్లూరులో సొంత పార్టీలోనే రాజకీయం హీటెక్కింది. నారాయణస్వామి వ్యతిరేక, అనుకూల వర్గాలు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. దీంతో అధికార వైసీపీ పరువు వీధిన పడింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికె టిక్కెట్ ఇవ్వాలంటూ ఆయన అనుకూల వర్గీయులు.. వద్దంటూ వ్యతిరేక వర్గం నిన్న సమావేశాలు నిర్వహించారు.
పెనుమూరు మండలం పులిగుండు వద్ద ఈ రెండు సమావేశాలూ జరిగాయి. నారాయణ స్వామికి టికెట్ ఇస్తేనే పని చేస్తామని ఆరు మండలాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనుమూరు, గంగాధర్ నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్ పురం, వెదురు కుప్పం, కార్వేటినగరం 6 మండలాల నుంచి భారీ సంఖ్యలో నారాయణస్వామి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. గంగాధర నెల్లూరుకు నారాయణస్వామియే కావాలని... ‘జగన్ ముద్దు, కొత్త అభ్యర్థి వద్దు’ అంటూ ప్ల కార్డులతో నారాయణస్వామి వర్గీయులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు..