Share News

AP HighCourt: రాజమండ్రిలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ సీరియస్

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:29 PM

Andhrapradeshh: రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి పోలీసు కమీషనర్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్‌లో అక్రమ మైనింగ్‌పై నివేదిక సమర్పించాలని కమీషనర్‌కు ఆదేశించింది.

AP HighCourt: రాజమండ్రిలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ సీరియస్

అమరావతి, జనవరి 3: రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ (AP HighCourt) సీరియస్ అయ్యింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి పోలీసు కమీషనర్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్‌లో అక్రమ మైనింగ్‌పై నివేదిక సమర్పించాలని కమీషనర్‌కు ఆదేశించింది. గతంలో మైనింగ్ నిలిపివేయాలని వంశీధర్ రెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఈరోజు (బుధవారం) మళ్లీ కేసు విచారణ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతుందని, కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి న్యాయవాది నర్రా శ్రీనివాస్ తీసుకువచ్చారు. సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు రిపోర్టు చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీకి ఆదేశాలు ఇస్తామని ఒక దశలో ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. అయితే తొలుత రాజమండ్రి కమీషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించింది. ఆయన నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. గతంలో తవ్విన దానికి పది రెట్లు ఎక్కువ తవ్వుతున్నారని కోర్టుకు న్యాయవాది నర్రా శ్రీనివాస్ చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2024 | 04:29 PM